సెబీ చీఫ్‌క్ పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు
మాధబి పురి బచ్‌ను పలు వివాదాలు అలుముకున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది.
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నదాకా అదానీ షేర్ల వ్యవహారంలో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ మాధబితో పాటు ఆమె భర్త ధావల్ బచ్‌పై చేసిన ఆరోపణలు, ఐసీఐసీఐ బ్యాంక్ జీత భత్యాల విషయంలో వార్తలో నిలిచారు. తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదుతో మరోసారి వివాదాల్లో నిలిచారు.
ఇన్ని వివాదాల మధ్యపార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) నుంచి సెబీ ఛైర్‌పర్సన్‌కు సమస్లు వచ్చాయి. అక్టోబర్ 24న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అదానీ వ్యవహారానికి సంబంధించి సెబీ చీఫ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల పనితీరును సమీక్షించాలని పీఏసీ నిర్ణయించింది. దీనిలోభాగంగానే ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. మాధభితో పాటు ఆర్థికశాఖ, ట్రాయ్ అధికారులకూ సమన్లు జారీ చేసింది. పీఏసీ సమావేశానికి సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్, ట్రాయ్ ఛైర్‌పర్సన్ అనికుమార్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదంటున్నారు. వారి తరఫున సీనియర్ అధికారులు సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని కమిటీ సభ్యులు సూచనప్రాయంగా వెల్లడించారు. మాధబి చుట్టూ పలు వివాదాలు అలుముకున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది.