ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఫేక్ ప్రొడక్ట్స్‌తో జాగ్రత్త!

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు నమ్మదగిన ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయినప్పటికీ అందులో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ ఒరిజినల్ అవ్వాలని లేదు. ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల స్టోర్స్ రిజిస్టర్ అయ్యి తమ ప్రొడక్ట్స్‌ను సేల్ చేస్తుంటాయి.

Advertisement
Update:2024-07-17 15:13 IST

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా మొదట ఆన్‌లైన్‌లోనే చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగింది. అయితే దీన్ని అదనుగా చేసుకుని కొన్ని ఆన్‌లైన్ స్టోర్స్.. ఫేక్ ప్రొడక్ట్స్‌తో మోసం చేస్తున్నాయి. ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్‌తో మోసపోకూడదంటే షాపింగ్ చేసేటప్పుడు ఇవి గమనించాలి.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు నమ్మదగిన ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయినప్పటికీ అందులో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ ఒరిజినల్ అవ్వాలని లేదు. ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల స్టోర్స్ రిజిస్టర్ అయ్యి తమ ప్రొడక్ట్స్‌ను సేల్ చేస్తుంటాయి. అయితే వీటలో కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతుంటాయి. షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకపోతే మోసపోక తప్పదు.

సెల్లర్ డీటెయిల్స్

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ ఒరిజినలా? కాదా? తెలుసుకునేందుకు సదరు సెల్లర్ పేజీని ఓపెన్ చేసి చూడాలి. ప్రతి ప్రొడక్ట్ కింద దాన్ని అమ్ముతున్న సెల్లర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆయా సెల్లర్ డీటెయిల్స్‌లో గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. లేదా కస్టమర్లు ఇచ్చిన రీవ్యూస్ చదివి కూడా డిసైడ్ అవ్వొచ్చు.

బ్రాండ్ నేమ్

ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనేవాళ్లు బ్రాండ్‌ నేమ్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బెటర్. పాపులర్ బ్రాండ్స్‌ను పోలి ఉండేలా సేమ్ లోగో, సేమ్ కలర్స్‌తో ఆన్‌లైన్‌లో బోలెడు ఫేక్ ప్రొడక్ట్స్ దర్శనమిస్తుంటాయి. బ్రాండ్ పేరులో గుర్తు పట్టలేనివిధంగా ఒక చిన్న మార్పు ఉంటుంది. దాన్ని ఒరిజినల్ అనుకుని చాలామంది మోసపోతుంటారు. కాబట్టి ఏదైనా కొనేముందు బ్రాండ్‌ నేమ్ చెక్ చేసుకోవడం ముఖ్యం.

గ్యారెంటీ/ రిటర్న్

ఆన్‌లైన్‌లో అంతగా పాపులర్ అవ్వని బ్రాండ్స్ కూడా బోలెడు ఉంటాయి. ఇలాంటి వాటిని కొనే ముందు వాటికి గ్యారెంటీ లేదా రిటర్న్ ఉందేమో చెక్ చేసుకోవాలి. రిటర్న్ పాలసీ ఉంటే కొన్నాక నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. నష్టపోయే అవకాశం ఉండదు.

వీడియోతో అన్‌ప్యాక్

ఈ మధ్యకాలంలో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, మొబైల్‌కు బదులు రాళ్లు, ఖాళీ డబ్బాలు రావడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు పార్శిల్ వచ్చిన వెంటనే వీడియో తీస్తూ ప్యాకేజీ ఓపెన్ చేయాలి. ఒకవేళ వచ్చింది నకిలీ అయితే వెంటనే సదరు ఇ–కామర్స్ సైట్‌కు కంప్లెయింట్ చేయొచ్చు.

ఇకపోతే ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ ఎంచుకునేముందు రివ్యూలు చదివితే ప్రొడక్ట్ గురించిన కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఎక్కువ మంది రేటింగ్స్ ఇచ్చిన ప్రొడక్ట్స్ ఎంచుకుంటే మంచిది. వీటితోపాటు స్మార్ట్ కంజ్యూమర్ అనే యాప్ ద్వారా ప్రొడక్ట్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి కూడా ప్రొడక్ట్ ఒరిజినలా? కాదా? అని తెలుసుకోవచ్చు. ఎవరైనా ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోయినట్టయితే కంజ్యూమర్ కోర్ట్ లో కంప్లెయింట్ చేసే వెసులుబాటు కూడా ఉంది.

Tags:    
Advertisement

Similar News