త్వరలోనే వన్‌ప్లస్ 12 లాంఛ్.. ఫీచర్లివే..
వన్‌ప్లస్ లవర్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 12 మొబైల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అవ్వబోతోంది.
వన్‌ప్లస్ లవర్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 12 మొబైల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అవ్వబోతోంది. వన్‌ప్లస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అవ్వడంతో దీని ఫీచర్లపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే..
ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఫ్లాగ్‌షిప్ బ్రాండ్‌గా వన్‌ప్లస్ పాపులర్ అయింది. ఆండ్రాయిడ్ ప్రీమియం సెగ్మెంట్‌లో శాంసంగ్ తర్వాత వన్‌ప్లస్ మొబైల్స్‌కే సేల్స్ ఎక్కువ. అయితే వన్‌ప్లస్ రీసెంట్ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 12.. ఇటీవలే చైనాలో లాంఛ్ అయింది. వచ్చే నెలలో ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ఉండబోతోంది.
వన్‌ప్లస్ 12 మొబైల్ లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. ఇది ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వెర్షన్ పై పని చేస్తుంది. ఇందులో 6.82- ఇంచెస్ ఎల్‌టీపీఓ ఓల్ఈడీ 2కే డిస్ ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 12జీబీ, 24 జీబీ ర్యామ్ వెర్షన్స్, 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి
ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో నాలుగు ప్రీమియం కెమెరాలు ఉండనున్నాయి. మొబైల్ వెనుక 50ఎంపీ ఫోర్త్ జనరేషన్ ప్రీమియం హస్సెల్‌బ్లేడ్ కెమెరాతోపాటు సోనీ ఎల్‌వైటీ- 808 సెన్సర్‌తో కూడిన 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపీ టెలీఫోటో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది50 వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, 10 వాట్స్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు ఈ ఫోన్‌లో రెయిన్‌వాటర్ టచ్ టెక్నాలజీ ఉండనుంది. వన్‌ప్లస్ 12 డిజైన్‌లో కూడా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. వెనుకవైపు కొత్త కెమెరా మాడ్యూల్‌తో పాటు సరికొత్త కలర్ ఆప్షన్లతో రానుంది. ధర సుమారు రూ.50,000కు దగ్గరగా ఉండొచ్చు.