Hyundai Creta | సెల్టోస్‌.. హై రైడ‌ర్‌.. గ్రాండ్ విటారాల‌కే షాక్‌.. మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో పాపుల‌ర్ ఈ కారు..!

Hyundai Creta | మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త‌గా హోండా ఎలివేట్ (Honda Elevate), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder) వంటి మోడ‌ల్ కార్లు వ‌చ్చాయి.

Advertisement
Update:2024-07-08 07:00 IST

Hyundai Creta | మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త‌గా హోండా ఎలివేట్ (Honda Elevate), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder) వంటి మోడ‌ల్ కార్లు వ‌చ్చాయి. కానీ, పాపుల‌ర్ మోడ‌ల్ - ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారు హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) ను బీట్ చేయలేక‌పోతున్నాయి. ఇప్ప‌టికీ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్‌లో హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది.

గ‌త నెల‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్య‌ధికంగా అమ్ముడైన పాపుల‌ర్ కారు హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) నిలిచింది. 2024 జూన్‌లో 16,293 యూనిట్ల హ్యుండాయ్ క్రెటా కార్లు అమ్ముడ‌య్యాయి. త‌ర్వాతీ స్థానంలో నిలిచిన (Maruti Suzuki Grand Vitara) కారు 9,679 యూనిట్లు అమ్ముడు పోయాయి. తృతీయ స్థానంలో నిలిచిన కియా సెల్టోస్ (Kia Seltos) కారు 6,306 యూనిట్లు విక్ర‌యించారు. నాలుగో స్థానంలో నిలిచిన ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder) రికార్డు స్థాయిలో 4,275 యూనిట్లు విక్ర‌యించింది.

 

2924 జ‌న‌వ‌రి - జూన్ మ‌ధ్య గ‌త ఆరు నెల‌ల్లో హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) కారు 91,348 యూనిట్ల విక్ర‌యాలు రిజిస్ట‌ర్ అయ్యాయి. 2023లో హ్యుండాయ్ వార్షిక కార్ల విక్ర‌యాల్లో స‌రికొత్త రికార్డు న‌మోదు చేయ‌డంలో హ్యుండాయ్ క్రెటా నిలిచింది. 2023లో హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) మోడ‌ల్ కార్లు గ‌తేడాది (2023)లో 1,57,311 యూనిట్లు విక్ర‌యించింది. ఇది దేశీయంగా హ్యుండాయ్ 2023లో విక్ర‌యించిన మొత్తం కార్ల‌లో 26.1% శాతం ఉంటాయి. ఇక మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుండాయ్ వాటా 30.7 శాతం. 2023లో మిడ్ సైజ్ సెగ్మెంట్‌లో 5,13,157 కార్లు ఉంటాయి.

 

హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) ప్ర‌స్తుతం స్టాండ‌ర్డ్ వ‌ర్ష‌న్‌, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఎన్‌-లైన్ వ‌ర్ష‌న్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. స్టాండ‌ర్డ్ వ‌ర్ష‌న్ కారు ధ‌ర రూ.11 ల‌క్ష‌ల నుంచి రూ.20.15 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. ఇక ఎన్ లైన్ వ‌ర్ష‌న్ కారు రూ.16.82 ల‌క్ష‌ల నుంచి రూ.20.45 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.

 

హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) కారులో ఎల్ఈడీ లైట్స్ (హెడ్ లైట్స్‌, డీఆర్ఎల్స్‌, టెయిల్ లైట్స్‌), 17- అంగుళాల డైమండ్ క‌ట్ అల్లాయ్ వీల్స్‌, ఇంటిగ్రేటెడ్ 10.25- అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, 10.25-అంగుళాల మ‌ల్టీ డిస్‌ప్లే డిజిట‌ల్ క్ల‌స్ట‌ర్‌, డ్యుయ‌ల్ జోన్ ఆటోమేటిక్ టెంప‌రేచ‌ర్ కంట్రోల్‌, వాయిస్ ఎనేబుల్డ్ ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్లు, బోస్ ప్రీమియం సౌండ్ సిస్ట‌మ్‌, స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 అడాస్ ఫీచ‌ర్లు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News