మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్.. ఆమె గురించి కొన్ని విషయాలు

2000లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లో ఆమె ఎంబీయే చేశారు. పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ గ్లోబల్ బోర్డులో పని చేశారు.

Advertisement
Update:2022-11-17 19:24 IST

మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ల మాతృసంస్థ అయిన మెటాకు హెడ్‌గా ఉన్న అజిత్ మోహన్ కంపెనీకి రాజీనామా చేసి స్నాప్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఫేస్‌బుక్ గేమింగ్ విభాగం.. ఏసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంధ్యా దేవనాథన్‌ను ఇండియా హెడ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. 2023 జనవరి 1న ఆమె మెటా ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపడతారు. మెటా ఏసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ డాన్ నియరీకి ఆమె రిపోర్ట్ చేస్తారని, అలాగే ఏసియా పసిఫిక్ లీడర్‌షిప్ టీమ్‌లో సంధ్య కొనసాగుతారని సంస్థ తెలిపింది.

ఇండియాలో వ్యాపార అభివృద్ధి, ఆదాయ మార్గాల అన్వేషణకు సంధ్య కృషి చేయనున్నారు. మెటా భాగస్వాములు, క్లయింట్స్‌తో కలిసి దీర్ఘ కాలంలో మెటా ఇండియా అభివృద్ధి చెందేలా చూస్తారని సంస్థ తెలిపింది.డిజిటల్ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇండియాపై మెటాకు ప్రత్యేక ప్రణాళిక ఉందని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ అన్నారు. బిజినెస్ మెసేజింగ్, రిల్స్ వంటి టాప్ ప్రొడక్ట్స్‌ను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే వాట్సప్‌లో జియో మార్ట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వీటన్నింటినీ మరింతగా వినియోగదారులకు చేరువ చేయడానికి సంధ్య తప్పకుండా కృషి చేస్తారని చెప్పారు.

2000లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లో ఆమె ఎంబీయే చేశారు. పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ గ్లోబల్ బోర్డులో పని చేశారు. సంధ్య దేవనాథన్ 2016 నుంచి మెటాలో ఉన్నారు. మెటా సింగపూర్ ఎండీగా, వియాత్నాం బిజినెస్‌ హెడ్‌గా ఆమె బాధ్యతలు నిర్వహంచారు. బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ విభాగాల్లో సంధ్యకు 22 ఏళ్ల అనుభవం ఉన్నది. బిజినెస్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్, కొత్త ప్రొడక్ట్స్ ఆవిష్కరణలో సంధ్యకు ఉన్న అనుభవం ఇండియాలో మెటా అభివృద్ధికి తోడ్పడుతుందని మార్నే లెవిన్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News