Maruti Suzuki Swift | 25 కిమీ మైలేజీతో భార‌త్ మార్కెట్‌లోకి మారుతి స్విఫ్ట్‌-2024.. రూ.6.49 ల‌క్ష‌ల నుంచి షురూ..!

Maruti Suzuki Swift | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ మార్కెట్‌లోకి త‌న పాపుల‌ర్ హ్యాచ్‌బ్యాక్ 2024-స్విఫ్ట్ (Swift- 2024)ను ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-05-10 16:45 IST

Maruti Suzuki Swift | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ మార్కెట్‌లోకి త‌న పాపుల‌ర్ హ్యాచ్‌బ్యాక్ 2024-స్విఫ్ట్ (Swift- 2024)ను ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.6.49 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభ‌మవుతుంది. టాప్ వేరియంట్ రూ.9.64 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. రూ.17,436ల నెల‌వారీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కింద స్విఫ్ట్‌-2024 ల‌భిస్తుంది. స్విఫ్ట్‌-2024 (2024 Maruti Suzuki Swift_ ఆల్ న్యూ జ‌డ్‌-సిరీస్ 1.2 లీట‌ర్ల 3సిలిండ‌ర్ పెట్రోల్ ఇంజిన్ క‌లిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 82 పీఎస్ విద్యుత్‌, 113 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుందీ కారు. ఫోర్త్ జ‌న‌రేష‌న్ స్విఫ్ట్ ఫ్యుయ‌ల్ మైలేజీ మ‌రింత పెరుగుతుంది. లీట‌ర్ పెట్రోల్‌పై మారుతి సుజుకి స్విఫ్ట్-2024 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ 24.8 కి.మీ, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ 25.75 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది.

 

న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ ఐదు వేరియంట్లు - ఎల్ఎక్స్ఐ (LXi), వీఎక్స్ఐ (VXi), వీఎక్స్ఐ (ఓ) (VXi(O), జ‌డ్ఎక్స్ఐ (ZXi), జ‌డ్ఎక్స్ఐ+ (ZXi+) వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. వేరియంట్ల వారీగా మారుతి స్విఫ్ట్ ధ‌ర‌వ‌ర‌లు ఇలా (ఎక్స్ షోరూమ్‌) ..

2024 స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 6.49 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ వీఎక్స్ఐ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 7.29 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ వీఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 7.79 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ వీఎక్స్ఐ (ఓ) మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ - రూ.7.56 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ వీఎక్స్ఐ (ఓ) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 8.06 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ జ‌డ్ఎక్స్ఐ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 8.29 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ జ‌డ్ఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 8.79 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ జ‌డ్ఎక్స్ఐ + మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ - రూ.8.99 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ జ‌డ్ఎక్స్ఐ+ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ - రూ. 9.49 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ జ‌డ్ఎక్స్ఐ + మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ డ్యుయ‌ల్ టోన్ - రూ. 9.14 ల‌క్ష‌లు

2024 స్విఫ్ట్ జ‌డ్ఎక్స్ఐ+ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ డ్యుయ‌ల్ టోన్ - రూ.9.64 ల‌క్ష‌లు

మారుతి సుజుకి ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 30 ల‌క్ష‌ల యూనిట్ల స్విఫ్ట్ మోడ‌ల్ కార్లు విక్ర‌యించింది. తొలిసారి 2005లో తొలి జ‌న‌రేష‌న్ స్విఫ్ట్ కారును మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. సెకండ్ జ‌న‌రేష‌న్ 2011, థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ 2018లో మార్కెట్‌లోకి ఎంట‌రైంది. గుజ‌రాత్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్ నుంచి దేశీయ విక్ర‌యాలు, విదేశాల్లో ఎగుమ‌తికి ఫోర్త్ జ‌న‌రేష‌న్ స్విఫ్ట్ కార్ డెవ‌ల‌ప్‌మెంట్ మారుతి సుజుకి రూ.1450 కోట్లు ఖ‌ర్చు చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌-2024 కారు ఎక్స్‌టీరియ‌ర్‌గా అంతా కొత్త‌గా డిజైన్ చేశారు. బూమ‌రాంగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు న్యూ గ్లోసీ ఫ్రంట్ గ్రిల్లె, ఎల్ఈడీ ప్రొజెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. రేర్‌లో న్యూ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, ఫ్రంట్ అండ్ రేర్‌లో న్యూ బంప‌ర్లు, 15-అంగుళాల ప్రిషిసియ‌న్ క‌ట్ డ్యుయ‌ల్ టోన్ అల్లాయ్ వీల్స్‌పై డ్రైవ్ చేయొచ్చు. రెండు కొత్త రంగులు - ల‌స్ట్రే బ్లూ, నావెల్ ఆరంజ్‌తోపాటు తొమ్మిది క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుందీ కారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ - 2024 ఇన్‌సైడ్ క్యాబిన్‌లో స్మార్ట్ ప్లే ప్రో + 9-అంగుళాల ట‌చ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ (Smartplay Pro+ 9-inch touchscreen infotainment system), 4.2 అంగుళాల ఎంఐడీతోపాటు (instrument cluster with a 4.2-inch MID), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (automatic climate control), వైర్ లెస్ చార్జ‌ర్ (wireless charger), అర్కామీస్ సౌండ్ సిస్ట‌మ్ (Arkamys sound system) ఉంటాయి. సుజుకి క‌నెక్ట్‌తోపాటు 40కి పైగా క‌నెక్టెడ్ కార్ ఫీచ‌ర్లు జ‌త క‌లిశాయి. మారుతి సుజుకి త‌న 2024 స్విఫ్ట్ త‌యారీలో 45 శాతం హై టెన్సిల్ స్టీల్‌, 20 శాతం ఆల్ట్రా హై టెన్సిల్ స్టీల్ వినియోగించారు. స్టాండ‌ర్డ్‌గా 6-ఎయిర్‌బ్యాగ్స్‌, త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

స్విఫ్ట్ - 2024 కారు న్యూ స‌స్పెన్ష‌న్ సిస్ట‌మ్‌, న్యూ హైడ్రాలిక్ క్ల‌చ్‌, మెరుగైన ఫ్యుయ‌ల్ ఎఫిషియెన్సీ ఉంటాయి. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌తో మాత్ర‌మే కాదు.. మైక్రో ఎస్‌యూవీ కార్లు టాటా పంచ్‌, హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ మోడ‌ల్ కార్ల‌కు గ‌ట్టి పోటీనిస్తుందీ స్విఫ్ట్‌-2024.

Tags:    
Advertisement

Similar News