Maruti Invicto | మారుతి ఇన్‌విక్టో ప్రీ-బుకింగ్స్.. సింగిల్ వేరియంట్.. ఒక్క కలర్ మాత్రమే
Maruti Invicto | మారుతి సుజుకి (Maruti Suzuki).. కార్ల తయారీలో అనునిత్యం సృజనాత్మకత, సరికొత్త టెక్నాలజీని కస్టమర్లకు పరిచయం చేస్తోంది.
Maruti Invicto | మారుతి సుజుకి (Maruti Suzuki).. కార్ల తయారీలో అనునిత్యం సృజనాత్మకత, సరికొత్త టెక్నాలజీని కస్టమర్లకు పరిచయం చేస్తోంది. తద్వారా కార్ల ప్రేమికులకు దగ్గరయ్యేందుకు అనుక్షణం శ్రమిస్తున్నది. అందులో భాగంగా మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మరో కారును మార్కెట్లోకి తెస్తున్నది. మూడు వరుసల్లో ఏడు సీట్ల కారు `ఇన్‌విక్టో (Invicto)ను జూలై 5న ఆవిష్కరించనున్నది. ఇప్పటికే ఇన్‌విక్టో (Invicto) ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి కూడా.. అయితే రెండు వేరియంట్లలో వస్తున్న మారుతి ఇన్ విక్టో (Maruti Invicto) ప్రస్తుతానికి సింగిల్ కలర్ ఆప్షన్ కారుపైనే ప్రీ బుకింగ్స్ ఆమోదిస్తున్నది.
మారుతి సుజుకి డీలర్‌షిప్ నెక్సా వెబ్‌సైట్ ప్రకారం మారుతి ఇన్‌విక్టో ఐఈ స్ట్రాండ్ హైబ్రీడ్ ఆల్ఫా + 2ఎల్ (Maruti Invicto IE Strong Hybrid Alpha+ 2L)` వేరియంట్.. అందునా `నెక్సా బ్లూ (సెలిస్టియల్-Celestial)` కలర్ ఆప్షన్ కారు బుకింగ్స్ మాత్రమే అనుమతిస్తోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం)తో టెక్నాలజీ మార్పిడి ఒప్పందంలో భాగంగా వస్తున్న నాలుగో మోడల్ కారు మారుతి సుజుకి ఇన్‌విక్టో ఎంవీపీ. (Maruti Suzuki Invicto). ఇప్పటి వరకు మారుతి, టయోటా మధ్య టెక్నాలజీ మార్పిడితో బాలెనో-గ్లాన్జా, విటారా బ్రెజా-అర్బన్ క్రూయిజర్, గ్రాండ్ విటారా- అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) టెక్నాలజీ బేస్డ్‌గా వస్తున్నదే ఇన్‌విక్టో (Invicto).
ఇన్‌విక్టో మార్కెట్లోకి ఎంటరైతే.. మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు కానున్నది. ఇప్పటి వరకు మారుతి కార్లలో గ్రాండ్ విటారా ఎక్కువ ధర పలుకుతున్నది. గ్రాండ్ విటారా టాప్ హై ఎండ్ మోడల్ కారు ధర రూ.19.79 లక్షలకు (ఎక్స్ షోరూమ్) లభిస్తున్నది. ఇన్‌విక్టో కారు ధర రూ.20 లక్షలు + (ఎక్స్ షోరూమ్). ఇన్నోవా హైక్రాస్ ధర కూడా రూ.18.55 లక్షల నుంచి రూ.29.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నది.
మారుతి సుజుకి ఇప్పటికే మార్కెట్లో రెండు ఎంపీవీ కార్లు- ఎర్టిగా (Ertiga), ఎక్స్ఎల్6 (XL6). ఇతర కార్ల తయారీ సంస్థలు పోటీ పడుతున్నా ఎంపీవీ సెగ్మెంట్‌లో మాత్రం దాదాపు 50 శాతం మార్కెట్ వాటా మారుతి సుజుకిదే.
ఇన్‌విక్టో స్ట్రాంగ్ హైబ్రీడ్ యూనిట్ కారు 2.0-లీటర్ల వీవీటీఐ (VVTi) పెట్రోల్ ఇంజిన్ విత్ సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 186 పీఎస్ విద్యుత్, 188 ఎన్ఎం టార్చి, 206 ఎన్ఎం మోటార్ టార్చి వెలువరిస్తుంది. ఈ-డ్రైవ్ సీక్వెన్షియల్ షిప్ట్‌తో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మారుతుంది.
అంతే కాదు ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ వీవీటీఐ (VVTi) పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో కూడా వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 174 పీఎస్ విద్యుత్, 205 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్‌తో డిజైన్ చేశారు. ఈ రెండు పవర్ ట్రైన్ ఇంజిన్లలో ఏది మారుతి ఇన్‌విక్టోలో వాడతారన్నది క్లారిటీ ఇవ్వలేదు.