Maruti Suzuki Brezza | ఈ కారంటే ఎంత క్రేజ్ అంటే.. వెయిటింగ్ పీరియడ్ 10 మంత్స్ ఓన్లీ
Maruti Suzuki Brezza | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి.
Maruti Suzuki Brezza | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి. అత్యాధునిక టెక్నాలజీ, సేఫ్టీ ప్రమాణాలతో కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణించే కార్లను భారతీయులకు అందుబాటులోకి తెచ్చిన సంస్థ. స్పేసియస్‌గా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)ను పరిచయం చేసింది. ఆ ఎస్‌యూవీల్లో ఒకటి బ్రెజా.. మారుతి బ్రెజా కారంటే ప్రతి ఒక్కరిలోనూ క్రేజ్ పెరుగుతున్నది. ఇప్పుడు మారుతి సుజుకి బ్రెజా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పది కలర్స్‌లో 15 వర్షన్లలో ఇష్టమైన వేరియంట్ ఎంచుకోవచ్చు. కానీ మారుతి బ్రెజాకు ఉన్న మోజు అంతా ఇంతా కాదు.. బ్రెజా కారు బుక్ చేసుకుంటే చేతికి రావడానికి దాదాపు 10 నెలల సమయం పడుతుందని మీడియా కథనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి బ్రెజా మీద మోజు ఎంత ఉందన్నది అర్థమవుతుంది కదా.
మారుతి బ్రెజా స్పెషిపికేషన్స్ | |
ఇంజిన్ | 1462 సీసీ |
బీహెచ్‌పీ | 86.63-101.65 బీహెచ్‌పీ |
సీటింగ్ కెపాసిటీ | 5 |
మైలేజే | లీటర్ పెట్రోల్ మీద 19.8-20.15 కి.మీ. మైలేజీ |
ఫ్యూయల్ | పెట్రోల్ లేదా సీఎన్జీ |
1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది. గరిష్టంగా 103 పీఎస్ విద్యుత్, 137 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్‌లో మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ 88 పీఎస్ విద్యుత్, 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
2022 మారుతి సుజుకి బ్రెజాలో యాంబియెంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వర్షన్ మోడల్ కార్లలో పెడల్ ఫిప్టర్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉంటాయి. వాటితోపాటు 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెడ్స్ అప్ డిస్‌ప్లే కోసం టర్న్ బై టర్న్ నేవీగేషన్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు. వెహికల్, అందులో ప్రయాణించే ప్రయాణికుల సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు ఆటోమేటెడ్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు.
10 కలర్స్‌తోపాటు 15 వేరియంట్లలో అందుబాటులో ఉన్న మారుతి బ్రెజా కారు ధర రూ.8.29 లక్షల నుంచి రూ.14.14 లక్షల మధ్య పలుకుతుంది. బేస్ వేరియంట్ మారుతి ఎల్ఎక్స్ఐ మోడల్ ధర రూ.8.29 లక్షలు ఉంటే.. టాప్ హై ఎండ్ కారు బ్రెజా జడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ డీటీ ధర రూ.14.14 లక్షలు.