Hatch Back Cars | ఆ మారుతి బాలెనో.. హ్యుండాయ్ ఐ20.. టాటా ఆల్ట్రోజ్‌ల్లో ఏది బెస్ట్‌.. డిస్కౌంట్లు ఇలా.. !

Hatch Back Cars | ప్ర‌తి ఏటా గ‌ణ‌నీయ స్థాయిలో అమ్ముడ‌వుతున్న మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ మోడ‌ల్ కార్లే ఈ ఏడాది టాప్ మోడ‌ల్స్‌గా నిలిచాయి.

Advertisement
Update: 2024-03-15 11:37 GMT

Hatch Back Cars | క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా ఉండే స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ)లపై మోజు పెంచుకుంటున్నారు. గ‌తంలో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌కు ఉన్న వాటా ఎస్‌యూవీలు లాగేసుకుంటున్నాయి. కానీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ త‌న స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకుంటున్న‌ది. ప్ర‌తి ఏటా గ‌ణ‌నీయ స్థాయిలో అమ్ముడ‌వుతున్న మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ మోడ‌ల్ కార్లే ఈ ఏడాది టాప్ మోడ‌ల్స్‌గా నిలిచాయి. మీరు ఏదైనా కారు కొనుగోలు చేయాలంటే వాటి గురించి తెలుసుకోండిలా..

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి లీడింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో 2023 ఏప్రిల్ నుంచి గ‌త నెలాఖ‌రు వ‌ర‌కూ 1,80,018 యూనిట్లు విక్ర‌యించింది. మార్చిలో బాలెనోపై రూ.57 వేల వ‌ర‌కూ ఆఫ‌ర్ చేస్తోంది. మారుతి సుజుకి బాలెనో ధ‌ర రూ.6,66 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.9.88 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) వ‌ర‌కూ ప‌లుకుతుంది.

మారుతి సుజుకి బాలెనో త‌ర్వాత హ్యుండాయ్ మోటార్స్ ఆధ్వ‌ర్యంలోని హ్యుండాయ్ ఐ20 నిలిచింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 64,833 యూనిట్లు విక్ర‌యించింది. దీనిపై ఈ నెల‌లో రూ.25 వేల వ‌ర‌కూ రాయితీలు అందిస్తోంది. హ్యుండాయ్ ఐ20 కారు ధ‌ర రూ.7.04 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.11.21 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌0 వ‌ర‌కు ప‌లుకుతుంది.

మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20 త‌ర్వాతీ స్థానంలో టాటా ఆల్ట్రోజ్ నిలిచింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ 64,177 యూనిట్ల కార్లు అమ్ముడ‌య్యాయి. దీనిపై మార్చిలో 15 వేల వ‌ర‌కూ రాయితీలు అందిస్తున్న‌ది టాటా మోటార్స్‌. ఈ కారు ధ‌ర రూ.6.65 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.10.80 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) వ‌ర‌కూ ప‌లుకుతుంది.

దేశంలో అమ్ముడ‌వుతున్న టాప్ కార్లివే..

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న కార్ల‌లో టాటా నెక్సాన్‌తోపాటు నాలుగు దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి కార్లు నిలిచాయి. మారుతి సుజుకి వాగ‌న్ఆర్‌, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్‌, మారుతి సుజుకి బ్రెజా నిలిచాయి. మారుతి వ్యాగ‌న్ఆర్ 1,83,810, బాలెనో 1,80,018, టాటా మోటార్స్ త‌యారు చేసిన టాటా నెక్సాన్ 1,57,639, మారుతి సుజుకి బ్రెజా 1,55,283 యూనిట్లు విక్ర‌యించింది.

Tags:    
Advertisement

Similar News