Mahindra XUV.e9 | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లపై మహీంద్రా నజర్.. త్వరలో మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9..?!
Mahindra XUV.e9 | మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారుతోపాటు ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ పేర్లతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నది.
Mahindra XUV.e9 | సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ కార్లలో మారుతి సుజుకి, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ కార్లలో టాటా మోటార్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థల్లో ఒక్కటైన మహీంద్రా అండ్ మహీంద్రా సైతం మారుతి సుజుకి, టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూసుకెళ్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు న్యూ ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. తాజాగా మహీంద్రా తన ఎక్స్‌యూవీ400.ఈవీ కార్ ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవలే భారత్ రోడ్లపై మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారు కనిపించింది. దీన్ని మార్కెట్లో ఆవిష్కరిస్తే మహీంద్రా తీసుకొచ్చిన న్యూ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ.ఈ9 నిలుస్తుందని అంతా భావిస్తున్నారు.
ఎక్స్‌యూవీ.ఈ9 కారు ఎస్‌యూవీ కూపే క్యాటగిరీలోకి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న లగ్జరీ కార్ల మాదిరిగా బాడీ స్టయిల్ ఉంటుంది. ఎస్‌యూవీ కూపే క్యాటగిరీలో తొలి కారును భారత్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. టాటా మోటార్స్ తన ఎస్‌యూవీ కూపే మోడల్ కారు టాటా కర్వ్ ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇటీవలే మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఎస్‌యూవీ కూపే సెగ్మెంట్‌లోకి ఎంటరైంది. 2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎక్స్‌యూవీ ఎయిరో కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఆ సమయంలో ఎస్‌యూవీ కార్ల తయారీలో అధికంగా ఇమిడి ఉన్న ఉత్పత్తి ఖర్చుల వల్ల ఎస్‌యూవీ కూపే సెగ్మెంట్‌ను పక్కన బెట్టింది.
ఇంగ్లో ప్లాట్‌ఫామ్ ఆధారంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 2775 ఎంఎం వీల్‌బేస్ ఫీచర్ ఉంటంది. ఎక్స్‌యూవీ.ఈ9 కారు పొడవుగా ఉంటుంది. ఎక్స్‌యూవీ.ఈ8ని పోలి, లైట్ బార్, వెర్టికల్లీ మౌంటెడ్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఫ్లాట్ బాయ్‌నెట్, మస్క్యులర్ హౌంచెస్‌తోపాటు సంప్రదాయ గ్రిల్లె ఉండదు. రేర్, సైడ్ డోర్ హ్యాండిల్స్, సీ-పిల్లర్, డిజిటల్ స్క్రీన్ క్లస్టర్, డాష్‌బోర్డ్ అడోర్నింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. సింగిల్ చార్జింగ్‌తో 450 కి.మీ దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారుతోపాటు ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ పేర్లతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నది. త్వరలో మార్కెట్లోకి రానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారు రెండు బ్యాటరీ సైజుల్లోనూ, సింగిల్ లేదా డ్యుయల్ మోటార్ కాన్ఫిగరేషన్‌తో వస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దీన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. 60-80 కిలోవాట్ల మోటార్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు. క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్లె, ఇంటిగ్రేటెడ్ హై మౌంటెడ్ స్టాప్ లాంప్, విస్తరించిన రూఫ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ అంటీనా, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, టూస్పోక్ ఫ్లాట్ బాటమ్డ్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.