Mahindra XUV 3XO | మహీంద్రా నుంచి సబ్ కంపాక్ట్ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ.. 29న ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!
Mahindra XUV 3XO | ఈ నెల 29న మహీంద్రా సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-4 Metre Compact SUV) కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను ఆవిష్కరిస్తుంది.
Mahindra XUV 3XO | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift) కారును మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) ఆవిష్కరించనున్నది. ఈ నెల 29న మహీంద్రా సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-4 Metre Compact SUV) కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను ఆవిష్కరిస్తుంది. టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్లకు ఫ్రెష్ అవతార్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) పోటీనిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) కారు ధర రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.14.75 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు ధర రూ.8.50 లక్షల నుంచి రూ.15.50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు ఎక్స్‌టీరియర్‌గా, ఇంటీరియర్ అప్‌డేట్స్‌తో వస్తోంది. ఫ్రంట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు ఫ్రంట్‌లో రీ డిజైన్డ్ గ్రిల్లే, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, బంపర్, న్యూ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రేర్‌లో న్యూ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, దిగువన మహీంద్రా లోగో, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ బ్యాడ్జితోపాటు న్యూ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు ఇంటిగ్రేడెడ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉంటాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ300 అత్యంత సేఫ్టీ కారు ఇది. న్యూ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు నాలుగు డిస్క్ బ్రేక్‌లు, సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీస్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ల టర్బో చార్జ్‌డ్ మల్టీపాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (టీసీఎంపీఎఫ్ఐ) పెట్రోల్ (110 పీఎస్ విద్యుత్ / 200 ఎన్ఎం టార్క్), 1.2 లీటర్ల ఎంస్టాలియన్ టర్బో చార్జ్‌డ్ ఇంటర్ కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (టీజీడీఐ) పెట్రోల్ (130 పీఎస్ విద్యుత్ / 230 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల డీజిల్ (117 పీఎస్ విద్యుత్/ 300 ఎన్ఎం టార్క్) ఆప్షన్లతో వస్తోంది. టీసీఎంపీఎఫ్ఐ, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6- స్పీడ్ ఏఎంటీ ఆప్షన్, టీజీడీఐ పెట్రోల్ వేరియంట్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తుంది.