Mahindra Thar ROXX | ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీల‌కు షాక్‌.. 15న మ‌హీంద్రా థార్ రాక్స్ ఆవిష్క‌ర‌ణ‌..

Mahindra Thar ROXX | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా త‌న ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీ ((Off Roader SUV)) 3-డోర్ థార్ (Thar) కారును 5-డోర్ థార్ (Thar) గా అప్‌డేట్ చేసింది.

Advertisement
Update: 2024-07-21 07:31 GMT

మ‌హీంద్రా థార్ రాక్స్

Mahindra Thar ROXX | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా త‌న ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీ ((Off Roader SUV)) 3-డోర్ థార్ (Thar) కారును 5-డోర్ థార్ (Thar) గా అప్‌డేట్ చేసింది. ఈ 5-డోర్ థార్ (Thar) కారును ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర‌దినోత్స‌వాన ఆవిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తాజాగా 5-డోర్ థార్ కారుకు మ‌హీంద్రా థార్ రాక్స్ (Thar ROXX) అనే పేరు కూడా పెట్టింది.

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా త‌న థార్ రాక్స్ (Thar ROXX) టీజ‌ర్ వీడియోను సంస్థ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ కారు న్యూ గ్రిల్లె, స‌ర్క్యుల‌ర్ హెడ్ ల్యాంప్స్, సీ-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌, ఎల్ఈడీ యూనిట్ల‌తో టెయిల్ లాంప్స్‌/ ఫాగ్ లాంప్స్ వ‌స్తాయి. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700), మ‌హీంద్రా స్కార్పియో -ఎన్ (Mahindra Scorpio-N)తోపాటు ఇటీవ‌లే మార్కెట్‌లో రిలీజ్ అయిన న్యూ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ల్లో మాదిరిగా మ‌హీంద్రా థార్ రాక్స్‌లో సైతం ప్రీమియం ఫీచ‌ర్లు బోలెడుంటాయి. ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, 360-డిగ్రీ కెమెరా వ్యూ వంటి ప్రీమియం ఫీచ‌ర్లు జ‌త చేశారు.

 

మ‌హీంద్రా థార్ ఫోర్త్ జ‌న‌రేష‌న్ కారు మ‌హీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx)లో రెండు కొత్త త‌లుపులు, పొడ‌వుతోపాటు వీల్ బేస్ కూడా పెరిగింది. ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీలు మాత్ర‌మే కాదు మొత్తం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోనే మ‌హీంద్రా థార్ రాక్స్ సంచ‌ల‌నం కానున్న‌ది. మ‌హీంద్రా 5-డోర్ థార్ కారులో 2.0లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ మోటార్‌, 2.2 లీట‌ర్ల డీజిల్ ఇంజిన్ ఆప్ష‌న్ ఉంది. రెండు ఇంజిన్లూ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్లు క‌లిగి ఉంటాయి. 4x4 డ్రైవ్ ట్రైన్‌, లో రేషియో గేర్ బాక్స్‌, రేర్ యాక్సిల్‌పై మెకానిక‌ల్ లాకింగ్‌, బ్రేక్ లాకింగ్ ఫ్రంట్ యాక్సిల్ ఉంటాయి. టూ వీల్ డ్రైవ్ వేరియంట్ల‌నూ మ‌హీంద్రా ఆఫ‌ర్ చేయ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. మ‌హీంద్రా 5-డోర్ థార్‌.. థార్ రాక్స్ ధ‌ర రూ.13 ల‌క్ష‌ల నుంచి 25 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.

Tags:    
Advertisement

Similar News