Kia Sonet facelift | టాటా నెక్సాన్ స‌హా ఆ ఆరు కార్ల‌కు స‌వాల్‌.. 25 సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో మార్కెట్‌లోకి కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌.. ధ‌ర ఎంతంటే..?!

Kia Sonet facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ కియా ఇండియా.. భార‌త్ మార్కెట్‌లో తన పాపుల‌ర్ స‌బ్‌-4 మీట‌ర్ ఎస్‌యూవీ కారు కియా సోనెట్-2024 ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-01-15 08:48 IST

Kia Sonet facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ కియా ఇండియా.. భార‌త్ మార్కెట్‌లో తన పాపుల‌ర్ స‌బ్‌-4 మీట‌ర్ ఎస్‌యూవీ కారు కియా సోనెట్-2024 ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్క‌రించింది. 360-డిగ్రీ కెమెరా, డిజిట‌ల్ డ్రైవ‌ర్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ టెక్నిక్స్ (అడాస్‌) వంటి 25 సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో రూపుదిద్దుకున్న‌దీ కారు. గ‌త నెల 14న గ్లోబ‌ల్ మార్కెట్‌తోపాటు భార‌త్ మార్కెట్‌లో ఎంట‌రైన కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌.. తొమ్మిది క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో క‌స్ట‌మ‌ర్లను ఆక‌ర్షిస్తున్న‌ది. న్యూ అల్లాయ్ వీల్స్‌, క‌నెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, అప్‌డేటెడ్‌ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో నూత‌నంగా గ్రిల్లే డిజైన్ చేశారు.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు ధ‌ర రూ.7.99 ల‌క్ష‌ల నుంచి రూ.15.69 ల‌క్ష‌ల‌ (ఎక్స్ షోరూమ్‌- ఇంట్ర‌డ్యూస‌రీ) మ‌ధ్య ప‌లుకుతుంది. గ‌త మోడ‌ల్ కారుతో పోలిస్తే రూ.20 వేలు ఎక్కువ‌. టాప్ వేరియంట్ కారుపై రూ.80 వేలు అద‌నంగా చెల్లించాలి. ఈ కారు కొనుక్కోవాల‌ని భావించే వారు రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి బుక్ చేసుకోవ‌చ్చు.


స్ట‌యిలిష్‌గా.. షార్ప్‌గా డిజైన్‌

ఇంత‌కుముందు మోడ‌ల్ కియా సోనెట్ క‌న్నా షార్ప్‌గా, స్ట‌యిలిష్‌గా డిజైన్ చేశారు. ఫ్రంట్‌లో సిగ్నేచ‌ర్ టైగ‌ర్ నోస్ గ్రిల్ ఇచ్చారు. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 త‌ర‌హాలో ఇరువైపులా సబేర్ స్టైల్‌తోపాటు అగ్రెసివ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. గ్రిల్లె దిగువ‌న.. ఫ్రంట్ బంప‌ర్‌పై థిన్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్ అమ‌ర్చారు. మ‌రోవైపు 16-అంగుళాల స్పోర్టీ క్రిస్ట‌ల్ క‌ట్ అల్లాయ్ వీల్స్‌, ఫుల్లీ క‌వ‌ర్డ్ బాడీ క్లాడింగ్‌, బాడీ క‌ల‌ర్ డోర్ హ్యాండిల్స్‌, రూఫ్ రెయిల్స్‌, ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్ ఉంటాయి. కియా సెల్టోస్ మాదిరిగానే రేర్‌లో క‌నెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ జ‌త చేశారు. వీటితోపాటు రేర్ స్పాయిల‌ర్‌, డార్క్ మెటాలిక్ అసెంట్‌తోపాటు స్పోర్టీ ఎయిరో డైన‌మిక్ రేర్ స్కిడ్ ప్లేట్ కూడా ఉంటుంది.

ఆల్ న్యూ సెల్టోస్‌ను త‌ల‌పించేలా కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియ‌ర్ డాష్‌బోర్డుపై 10.25 అంగుళాల డిజిట‌ల్ డ్రైవ‌ర్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ డిస్‌ప్లే ఉంట‌ది. 70+ క‌నెక్టెడ్ కార్ ఫీచ‌ర్ల‌తో ఇన్‌ఫోటైన్‌మెంట్ ట‌చ్ స్క్రీన్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 4-వే ప‌వ‌ర్ అడ్జ‌స్ట‌బుల్ డ్రైవ‌ర్ సీట్, 7-స్పీకర్ బోస్ ఆడియో సిస్ట‌మ్‌, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్‌, ఇన్ బిల్ట్ ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్‌, 360-డిగ్రీ కెమెరా, వాయిస్ ఆప‌రేటెడ్ స‌న్‌రూఫ్ ఉంటాయి.


ఇవీ ఇంజిన్ స్పెషిఫిషన్స్‌..

ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న సోనెట్ మాదిరిగానే కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కూడా మ‌ల్టీపుల్ ఇంజిన్లు, ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తున్న‌ది. ఎంట్రీ లెవ‌ల్ వేరియంట్ 1.2 లీట‌ర్ల నాచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 82 బీహెచ్‌పీ విద్యుత్‌, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో ప‌ని చేస్తుంది.

118 బీహెచ్పీ విద్యుత్‌, 172 ఎన్ఎం టార్క్ వెలువరించే కెపాసిటీ గ‌ల 1-లీట‌ర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఇది 7-స్పీడ్ డ్యుయ‌ల్ క్ల‌చ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ క్ల‌చ్‌లెస్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది.


6-స్పీడ్ క్ల‌చ్‌లెస్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 6-స్పీడ్ టార్క్ క‌న్వ‌ర్ట‌ర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌తో 1.5 లీట‌ర్ల డీజిల్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 114 బీహెచ్‌పీ విద్యుత్‌, 250 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ లీట‌ర్‌పై 18.83 కి.మీ, డీజిల్ ఇంజిన్ లీట‌ర్‌పై 22.3 కి.మీ మైలేజీ ఇస్తుంది. 2020లో భార‌త్ మార్కెట్‌లో రిలీజ్ చేసిన త‌ర్వాత మేజ‌ర్ అప్‌డేట్ చేయ‌డం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లు, ఐదు ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తుంది ఈ కారు.

ఈ కార్ల‌తో సై అంటే సై..

మారుతి బ్రెజా, టాటా నెక్సాన్‌, హ్యుండాయ్ వెన్యూ, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300, రెనాల్ట్ కైగ‌ర్, నిసాన్ మ్యాగ్నైట్ కార్ల‌తో పోటీ ప‌డుతుందీ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఈ కారు ధ‌ర రూ.7.99 ల‌క్ష‌లు ప‌లుకుతున్న‌ది. అప్‌డేటెడ్ సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రూ.8 ల‌క్ష‌ల నుంచి (ఎక్స్ షోరూమ్‌) ప్రారంభం అవుతుంది.

ఇలా సేఫ్టీ ఫీచ‌ర్లు..

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎల‌క్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూష‌న్‌, ఎమ‌ర్జెన్సీ స్టాప్ సిగ్న‌ల్‌, బ్రేక్ అసిస్ట్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), వెహిక‌ల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), యాంటీ లాక్ బ్రేక్ సిస్ట‌మ్ (ఏబీఎస్‌) వంటి సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి. అన్ని వేరియంట్ కార్ల‌లో 6-ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికంగా వాడుతున్న‌ది. కియా సెల్టోస్‌లో మాదిరిగా ఇంకా 17 అటాన‌మ‌స్ లెవ‌ల్ 2 ఫీచ‌ర్లు కూడా జ‌త క‌లిశాయి. స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, ఫ్రంట్ కొల్లిష‌న్ వార్నింగ్ (ఎఫ్‌సీడ‌బ్ల్యూ), లేన్ కీప్ అసిస్ట్‌, రేర్ బ్లైండ్ స్పాట్ కొల్లిష‌న్ అవాయిడెన్స్, అటాన‌మ‌స్ ఎమ‌ర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News