ఇంటర్వ్యూ అంటే భయమేస్తుందా? ఇలా ఎదుర్కోండి!

ఇంటర్వ్యూకి వెళ్లేముందు సెలక్ట్ అవుతానో.. లేదో.. అన్న భయం వెంటాటడం మామూలే. అయితే ఇలా భయం, కంగారుతో ఇంటర్వ్యూకి వెళ్లడం ద్వారా సెలక్ట్ అయ్యే అవకాశాలు మరింత తగ్గిపోతాయి.

Advertisement
Update:2024-06-27 08:00 IST

సబ్జెక్ట్‌లో ఎంత నాలెడ్జ్ ఉన్నా.. ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే మాత్రం భయపడుతుంటారు చాలామంది. ముఖ్యంగా మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇలాంటి భయం సహజం. దీన్ని ఎలా ఫేస్ చేయొచ్చంటే..

ఇంటర్వ్యూకి వెళ్లేముందు సెలక్ట్ అవుతానో.. లేదో.. అన్న భయం వెంటాటడం మామూలే. అయితే ఇలా భయం, కంగారుతో ఇంటర్వ్యూకి వెళ్లడం ద్వారా సెలక్ట్ అయ్యే అవకాశాలు మరింత తగ్గిపోతాయి. కాబట్టి ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా కనిపించడం ఎంతైనా అవసరం. కొద్దిపాటి ప్రిపరేషన్‌తో ఈ కాన్ఫిడెన్స్‌ను బిల్డ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

సెలక్ట్ అవ్వడం గురించి ఎక్కువగా ఆలోచిస్తే భయం కలగక మానదు. కాబట్టి సెలక్షన్ గురించి మర్చిపోయి ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాలి. ముందుగా ఆ జాబ్‌కు కావల్సిన స్కిల్స్ ఏంటో స్పష్టంగా అంచనా వేసుకోవాలి. అవి మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అడిగిన ప్రశ్నలను బట్టి మీ స్కిల్స్ గురించి వివరించే ప్రయత్నం చేయాలి.

ఇంటర్వ్యూకు వెళ్లేముందే ఆయా సంస్థల ప్రొఫైల్స్‌ను క్షుణ్ణంగా స్టడీ చేయాలి. ఆ సంస్థపై మీకు పూర్తి అవగాహన ఉందన్న విషయం సెలక్టర్లకు తెలిస్తే మీపై పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది.

ఇంటర్వ్యూలో భయపడకుండా ఉండాలంటే టెక్నికల్‌గా మంచి నాలెడ్జి ఉండాలి. మీ సబ్జెక్ట్‌పై మీకు ఫుల్ కమాండ్ ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పగలనా? లేదా? అన్న భయం ఉండదు. టెక్నికల్ రౌండ్‌లో బాగా రాణిస్తే సగం ఇంటర్వ్యూ పూర్తయినట్టే.

ఇంటర్వ్యూకు వెళ్లేముందు మీ సబ్జెక్ట్‌కు సంబంధించిన రంగంలో వస్తున్న తాజా మార్పులు, కొత్త ఆవిష్కరణల వంటి విషయాలు తెలుసుకోవాలి. అవసరమైనప్పుడు వాటి గురించి ప్రస్తావించాలి. అలాగే అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్, మీ వర్కింగ్ స్టైల్, స్ట్రెంత్స్, మీరు సాధించిన విజయాల గురించి కూడా కాన్ఫెడెంట్‌గా మాట్లాడాలి. దీనివల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో పాటు ముందుచూపు ఉందన్న విషయం సెలక్టర్లుకు అర్థమవుతుంది. ఇలాంటి మెళకువల ద్వారా ఇంటర్వ్యూ భయాలను చాలా వరకూ తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూలో సెలక్ట్ అవ్వకపోతే నిరాశ చెందకుండా మరో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి

Tags:    
Advertisement

Similar News