Rakesh Gangwal- IndiGo | సంక్షోభంలో ఇండిగో.. భారీగా వాటా విక్రయించిన రాకేశ్ గంగ్వాల్..?!
Rakesh Gangwal- IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ. దీన్ని రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal), రాహుల్ భాటియా (Rahul Bhatia) కలిసి 2006లో స్థాపించారు.
Rakesh Gangwal- IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ. దీన్ని రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal), రాహుల్ భాటియా (Rahul Bhatia) కలిసి 2006లో స్థాపించారు. ఇండిగోలో అమెరికాకు చెందిన రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal) ఆధ్వర్యంలోని ఇంటర్‌గ్లోబ్ (InterGlobe) 51.12 శాతం, వర్జీనియా కేంద్రంగా పని చేస్తున్న కైలం ఇన్‌వెస్ట్‌మెంట్స్ (Caelum Investments) 47.88 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2012లో దేశంలోనే విమానయాన మార్కెట్‌లో అత్యధిక వాటా గల సంస్థగా నిలిచింది. 2022 కల్లా ప్రపంచంలో అత్యంత పాపులర్ ఎయిర్‌లైన్స్‌లో 15వ ర్యాంక్ పొందింది. అంతటి పాపులారిటీ గల ఇండిగో (IndiGo)లో విభేదాలు పొడచూపాయి. సరిగ్గా ఐదేండ్ల క్రితం 2019లో తన అధికారాలకు రాహుల్ భాటియా (Rahul Bhatia) కత్తెర వేస్తున్నారని రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal) బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
ఇండిగో నిర్వహణలో కార్పొరేట్ గవర్నెన్స్ (Corporate Governance)లో లోపాలు ఉన్నాయని రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal) ఆరోపించారు. మరోవైపు, సంస్థలో తన అధికారాలను తగ్గించడానికి రాహుల్ భాటియా (Rahul Bhatia) ప్రయత్నిస్తున్నారని అప్పట్లోనే రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal) బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను రాహుల్ భాటియా ((Rahul Bhatia) తిరస్కరించినా.. వారిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలను రాహుల్ భాటియా (Rahul Bhatia) తోసిపుచ్చినా రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal) వెనక్కు తగ్గలేదు. దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ `సెబీ (SEBI)`ని జోక్యం చేసుకోవాలని రాకేశ్ గంగ్వాల్ కోరారు. నాటి నుంచి ఇండిగో (IndiGo) నుంచి రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal) క్రమంగా వెనక్కి తగ్గుతూ వచ్చారు. 2022 ఫిబ్రవరిలోనే రాకేశ్ గంగ్వాల్.. ఇండిగో బోర్డు డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. అప్పట్లోనే సంస్థలో తన వాటాను క్రమంగా తగ్గించుకుంటానని ప్రకటించారు. దాని కొనసాగింపుగా రాకేశ్ గంగ్వాల్ భార్య శోభా గంగ్వాల్ 2023 ఆగస్టులో పూర్తిగా ఇండిగో బోర్డు నుంచి వైదొలిగారు.
తాజాగా రాకేశ్ గంగ్వాల్ తన వాటాలో గణనీయ భాగం బ్లాక్ డీల్ ద్వారా విక్రయించారు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (InterGlobe Aviation)లో రాకేశ్ గంగ్వాల్, ఆయన చింకెర్‌పూ ఫ్యామిలీ ట్రస్ట్ తమ 22.5 మిలియన్ల షేర్లను విక్రయించారు. సంస్థ షేర్ విలువ రూ.4,714.90 చొప్పున రాకేశ్ గంగ్వాల్, చింకెర్‌పూ ఫ్యామిలీ ట్రస్ట్ విక్రయించిన వాటా విలువ సుమారు రూ.9,549 (1.3 బిలియన్ యూఎస్ డాలర్లు) కోట్లు.
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌లో 22.5 మిలియన్ల షేర్లు.. ఇండిగో (IndiGo)లో గంగ్వాల్ మొత్తం వాటాలో సుమారు 30 శాతం. గంగ్వాల్ నేరుగా 5.89 శాతం, చింకెర్‌పూ ఫ్యామిలీ ట్రస్ట్ 13.49 శాతం వాటా కలిగి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇండిగో (IndiGo) షేర్ విలువ 92 శాతం వృద్ధి చెందింది. బుధవారం రికార్డు గరిష్ట స్థాయి రూ.4,859.85లకు చేరుకున్న తర్వాత రాకేశ్ గంగ్వాల్ తన వాటా విక్రయించడం గమనార్హం. ఫ్లోర్ ప్రైస్ ప్రకారం బ్లాక్ డీల్ లో ఇండిగో షేర్ ప్రీమియం విలువ రూ.4,593. మార్కెట్ ధరపై 5.5 శాతం డిస్కౌంట్‌పై విక్రయించినట్లు బ్లూంబర్గ్ నివేదించింది.
ఈ ఏడాది బ్లాక్ ఈక్విటీ ట్రాన్సాక్షన్లలో ఇండిగో (IndiGo) లో రాకేశ్ గంగ్వాల్ వాటా విక్రయ ఒప్పందం మూడవది. ఇంతకుముందు ఐటీసీ, ఇండస్ టవర్స్‌ల్లో వాటాదారులు తమ వాటాలను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించారు. గత నెలాఖరు నాటికి దేశీయ పౌర విమానయాన రంగ మార్కెట్‌లో ఇండిగోకు 62 శాతం వాటా ఉంది. తర్వాతీ స్థానంలో ఉన్న టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 14 శాతం మాత్రమే.