భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
సెన్సెక్స్ 819.98 పాయింట్ల లాభంతో.. 22,700 పైన ట్రేడవుతున్న నిఫ్టీ;
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు అదే బాటలో పయనిస్తున్నాయి. వరుస నష్టాలు చవిచూసిన మార్కెట్ సూచీలు.. కనిస్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో వరుసగా రెండోరోజు సూచీలు పరుగులు తీస్తున్నాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల లాభంతో 75 వేల మార్కెట్‌ను తాకింది. నిఫ్టీ 22,700 పైన ట్రేడయింది.
11.30 గంటల సమయంలో సెన్సెక్స్ 819.98 పాయింట్ల లాభంతో 74989.93 వద్ద ట్రేడవుతుంటే.. నిఫ్టీ 248.30 పాయింట్ల లాభంతో 22757.05 వద్ద కదలాడుతున్నది. సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.