నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఫలితం

Advertisement
Update:2024-10-04 11:29 IST

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంతో మధ్య దేశీయ మార్కెట్‌ సూచీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాలోకి వెళ్లాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 228 పాయింట్లు నష్టపోయి 82,122 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 12825 పాయింట్లు కుంగి 25,185 వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌ టీ, రిలయన్స్‌ షేర్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌,, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా ఐదు షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.96 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77 డాలర్లపైనే ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,682.30 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. 

Tags:    
Advertisement

Similar News