BSE M-Cap @ $4 Trillion | ఆ 4 దేశాల త‌ర్వాత స్థానం మ‌న‌దే.. కీల‌క మైలురాయి దాటిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్.. అదేమిటంటే..?!

BSE M-Cap @ $4 Trillion | దేశీయ స్టాక్‌మార్కెట్లు కీల‌క మైలురాయిని అధిగ‌మించాయి. దేశ వృద్ధిరేటు నాలుగు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉండ‌గా, బాంబే స్టాక్ ఎక్చ్చేంజ్ 4 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల మైలురాయిని దాటేసింది.

Advertisement
Update:2023-11-29 12:30 IST

BSE M-Cap @ $4 Trillion | భార‌త్ వృద్ధిరేటు నాలుగు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల మార్క్‌కు చేరువ‌లో ఉంది.. కానీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు.. అంటే స్టాక్ మార్కెట్‌లు ఆ మైలురాయిని దాటేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ సంస్థ‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ బుధ‌వారం రూ.333 ల‌క్ష‌ల కోట్ల (4 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) మార్క్‌కు అధిగమించింది. త‌ద్వారా వివిధే దేశాల స్టాక్ మార్కెట్‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ విలువ‌లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఐదో ర్యాంక్ సాధించింది. అమెరికా, చైనా, జపాన్‌, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ల త‌ర్వాతీ స్థానం బీఎస్ఈదే.

మ‌రోవైపు బ్రాడ్ మార్కెట్ ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 10 శాతానికి పైగా వృద్ధి చెందింది. ద‌లాల్ స్ట్రీట్‌లోకి కొత్త సంస్థల‌ ఐపీవోలు పోటెత్త‌డంతో స్మాల్ క్యాప్‌, మిడ్ క్యాప్ స్టాక్స్ అద్భుతంగా దూసుకెళ్ల‌డంతో ఎస్ఎస్ఈ లిస్టెడ్ సంస్థ‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ సుమారు రూ. 51ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ది. 2021 మేలో భార‌త్ స్టాక్ మార్కెట్లు మూడు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరాయి. ఐపీఓల ద్వారా కొత్త సంస్థ‌లు స్టాక్ మార్కెట్ల‌లోకి ఎంట‌ర్ కావ‌డంతో వాటి మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ వృద్ధి చెందింది.

2023లో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు సుమారు రూ.ల‌క్ష కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్ట‌ర్లు రూ.177.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుంది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఈ ఏడాది 5,540.52 పాయింట్లు (9.10 శాతం) వృద్ధి చెందింది. బుధ‌వారం ట్రేడింగ్ పాజిటివ్‌గా మారి బీఎస్ఈ సెన్సెక్స్ 305.44 పాయింట్లు ల‌బ్ధి పొంది 66,479.64 పాయింట్ల‌కు చేరుకుంది.

మ‌రోవైపు, ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాల‌ర్‌పై రూపాయి మారకం విలువ‌ రూ.83.31 వ‌ద్ద ట్రేడ‌వుతున్న‌ది. దీని ప్ర‌కారం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ నాలుగు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల (రూ.3,33,26,881.49 కోట్లు) మార్క్‌కు చేరుకున్న‌ది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15న బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 67,927.23 పాయింట్ల ఆల్‌టైం గ‌రిష్ట స్థాయికి దూసుకెళ్లింది.

2021 మే 24న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ మూడు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుంది. నాటికి అమెరికా, చైనా, జ‌పాన్‌, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ల ఎం-క్యాప్ 4 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల పై మాటే. అంత‌కుముందు 2007 మే 28న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ల‌క్ష కోట్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. ఈ మార్క్ నుంచి 1.50 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల మైలురాయిని చేరుకోవ‌డానికి 2,566 రోజులు (ఏడేండ్లు) అంటే 2014 జూన్ 6 వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టింది. తిరిగి 2017 (1,130 రోజులు) జూలై 10 నాటికి బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు, 2020 డిసెంబ‌ర్ 16 నాటికి 2.50 ల‌క్ష‌ల కోట్ల (1255 రోజులు) డాల‌ర్ల మైలురాయికి చేరుకున్న‌ది.

Tags:    
Advertisement

Similar News