లాభాలతో ప్రారంభమైన సూచీలు

సెన్సెక్స్‌ 80,700, నిఫ్టీ 24,400 వద్ద కొనసాగుతున్నాయి

Advertisement
Update:2024-12-03 11:00 IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమాయానికి నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,400 వద్ద, సెన్సెక్స్‌ 450 పాయింట్లు పెరిగి 80,700 సమీపంలో కొనసాగుతున్నాయి. రూపాయి విలువ నేడు 84.73గా ఉన్నది.

సోలార్‌ ఇండస్ట్రీస్‌, ఎంవోఐఎల్‌, ప్రికోల్‌ లిమిటెడ్‌, నవ లిమిటెడ్‌ షేర్లు అత్యధిక లాభాల్లో ఉండగా.. వరుణ్‌ బేవరేజస్‌, స్ట్రైడెస్‌ ఫార్మా, వినతి ఆర్గానిక్స్‌, సన్‌టెక్‌ రియాల్టీ, అరవింద్‌, జెన్‌ టెక్నాలజీస్‌, చోళమండల్‌ ఫైనాన్స్‌ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. ఒక్క షెంజన్‌ సూచీ మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి.

ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌, స్మార్ట్‌వర్క్స్‌ కోవర్కింగ్‌ స్పేసెస్‌ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ప్రతిపాదనలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ) అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీలన్నీ కలిపి సుమారు రూ. 12,300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఐపీవో అనుమతులు పొందిన కంపెనీల్లో ట్రూఆల్ట్‌ బయోఎనర్జీ, కరారో ఇండియా, కాంకర్డ్‌ ఎన్విరో సిస్టమ్‌, వెంటివ్‌ హాస్పిటాలిటీ ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఐపీవోకు వచ్చే అవకాశం ఉందని క్విక్‌ కామర్స్‌ సంస్థ జెఫ్టో సీఈవో అదిల్‌ పలిచా తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News