ట్విట్టర్‌ కొని తప్పు చేశా

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement
Update:2024-11-05 18:43 IST

సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ట్విట్టర్‌ (ఎక్స్‌) కొనడం పిచ్చితనమని.. ట్విట్టర్‌ కొని తప్పు చేశానని దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌ ను 44 బిలియన్‌ డాలర్లకు కొనడం పెద్ద తప్పు అన్నారు. జీరోగన్‌ పాడ్‌ కాస్ట్‌ లో మస్క్‌ మాట్లాడుతూ.. చాలా ఎక్కువ ధర చెల్లించి ట్విట్టర్‌ ను కొన్నానని తెలిపారు. ట్విట్టర్‌ కొనడానికి పెద్ద కారణమే ఉందని చెప్పుకొచ్చారు. దాని నుంచి భవిష్యత్‌ లో మంచి రాబడి ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. ట్విట్టర్‌ ను కొనకపోయి ఉంటే తాను చిక్కుల్లో పడేవాడినని అన్నారు. రానున్న రోజుల్లో తనకు ట్విట్టర్‌ మరింత సక్సెస్‌ తెచ్చి పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరు 'ఎక్స్‌'గా మార్చారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సమాచార మార్పిడి కోసం ఎక్స్‌ ను ఉపయోగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News