Hyundai - ADAS | సేఫ్టీకి హ్యుండాయ్ ఫ‌స్ట్ ప్రియారిటీ.. మూడేండ్ల‌లో అన్ని కార్ల‌లో అడాస్ టెక్నాల‌జీ..!

Hyundai - ADAS | క‌రోనా త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement
Update: 2023-10-04 06:21 GMT

Hyundai - ADAS | సేఫ్టీకి హ్యుండాయ్ ఫ‌స్ట్ ప్రియారిటీ.. మూడేండ్ల‌లో అన్ని కార్ల‌లో అడాస్ టెక్నాల‌జీ..!

Hyundai - ADAS | క‌రోనా త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా.. సేఫ్టీ ఫీచ‌ర్లు గ‌ల కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా కార్ల‌లో ప్ర‌యాణించే వారి భ‌ద్ర‌త‌కు, రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎంట్రీ లెవ‌ల్ కార్లు మొద‌లు ఎస్‌యూవీలు, సెడాన్లు, హ్యాచ్ బ్యాక్ మోడ‌ల్స్‌.. ఒక్క‌టేమిటి.. ప్ర‌తి కార్ల త‌యారీ సంస్థ‌.. ప్ర‌తి మోడ‌ల్‌లోనూ అత్యాధునిక భ‌ద్ర‌తా ప్ర‌మాణాల ఫీచ‌ర్ల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌డంలో పోటీ ప‌డుతున్న‌ది.

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇప్ప‌టి వ‌రకూ టెక్నాల‌జీని అంది పుచ్చుకోవ‌డంలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న‌ది. మారుతి త‌ర్వాతీ స్థానంలో ఉన్న ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ‌చ్చే మూడేండ్ల‌లో డ్రైవ‌ర్‌తోపాటు ప్ర‌యాణికుల సేఫ్టీకి పెద్ద పీట వేస్తూ.. అన్ని మోడ‌ల్ కార్ల‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవ‌ర్ అసిస్టెన్స్ సిస్ట‌మ్ (advanced driver assistance system - ADAS) అమ‌ర్చాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఈ టెక్నాల‌జీ ఫీచ‌ర్లు గ‌ల కార్లు ఐదు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.

హ్యుండాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లో గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios), ఐ20 (i20), ఐ20 ఎన్‌-లైన్ (i20 N-Line), ఔరా (Aura), ఎక్స్‌ట‌ర్ (Exter), వెన్యూ (Venue), వెన్యూ ఎన్‌-లైన్ (Venue N-Line), వెర్నా (Verna), క్రెటా (Creta), అల్కాజ‌ర్ (Alcazar), ట‌స్క‌న్ (Tucson), కోనా ఎల‌క్ట్రిక్ (Kona Electric), ఐయానిక్ 5 (Ioniq 5) మోడ‌ల్ కార్లు విక్ర‌యిస్తోంది.

వీటిల్లో వెన్యూ (Venue), వెన్యూ ఎన్‌-లైన్ (Venue N-Line), వెర్నా(Verna), ట‌స్క‌న్ (Tucson), ఐయానిక్ 5 (Ioniq 5) కార్లు మాత్ర‌మే అడాస్ (ADAS) టెక్నాల‌జీ క‌లిగి ఉన్నాయి. ఐయానిక్ 5 (Ioniq 5) లో అడాస్ టెక్నాల‌జీ స్టాండ‌ర్డ్‌గా వినియోగిస్తున్న‌ది హ్యుండాయ్‌. మిగ‌తా నాలుగు మోడ‌ల్ కార్ల‌లో హై ఎండ్ వ‌ర్ష‌న్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం హ్యుండాయ్ త‌న పోర్ట్‌పోలియోలో 33 శాతం కార్ల‌లో మాత్ర‌మే అడాస్ (ADAS) టెక్నాల‌జీ వినియోగిస్తున్న‌ది. 2024 నాటికి 60 శాతం, 2026 నాటికి 100 శాతం కార్ల‌లో అడాస్ (ADAS) టెక్నాల‌జీ విస్త‌రించాల‌ని యోచిస్తున్న‌ది.

అంతేకాదు.. భార‌త్‌లో త‌యారుచేసే అన్ని కార్ల‌లో ప్ర‌యాణికుల భ‌ద్ర‌త కోసం సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ (ఫ్రంట్‌, సైడ్‌, క‌ర్టైన్‌) స్టాండ‌ర్డ్‌గా తీసుకొచ్చిన తొలి ఆటోమొబైల్ సంస్థ‌గా హ్యుండాయ్ నిలిచింది. అన్ని హ్యుండాయ్ కార్ల‌లో ఇప్పుడు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌, అన్ని సీట్ల‌కు సీట్ బెల్ట్ రిమైండ‌ర్లు తీసుకొచ్చింది. వీటితోపాటు ప్ర‌తి మోడ‌ల్ కారులోనూ ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), టైర్ ప్రెజ‌ర్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ (TPMS) ఆఫ‌ర్ చేస్తున్న‌ది.

సేఫ్టీకి ప్ర‌థ‌మ తాంబూలం ఇస్తున్న హ్యుండాయ్.. త‌న పాపుల‌ర్ మిడ్ సైజ్ సెడాన్ వెర్నా (Verna).. క్రాష్ టెస్ట్‌ల్లో గ్లోబ‌ల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (జీఎన్‌సీఏపీ)లో స్ఫూర్తిదాయ‌క రేటింగ్ అందుకున్న‌ది. అడ‌ల్ట్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్ష‌న్ కోసం ఫైవ్‌స్టార్ రేటింగ్ అందుకున్న‌ది. రెండు కేట‌గిరీల్లోనూ గ‌రిష్ట రేటింగ్ అందుకున్న తొలి హ్యుండాయ్ మోటార్ ఇండియా కారు వెర్నా (Verna).

అడ‌ల్ట్ ప్ర‌యాణికుల ర‌క్ష‌ణ‌లో 34 పాయింట్ల‌కు గానూ 28.18 పాయింట్ల ప్రొటెక్ష‌న్ అందిస్తుంది వెర్నా. రోడ్డు ప్ర‌మాదాల్లో కార్లు, ఇత‌ర వాహ‌నాలు ప‌ర‌స్ప‌రం ఢీకొన్న‌ప్పుడు ప్ర‌యాణికుల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చం క‌ల్పించ‌గ‌ల కెపాసిటీ దీని సొంతం అన్న‌మాట‌. యువ ప్ర‌యాణికుల భ‌ద్ర‌త కోసం 49 పాయింట్ల‌కు 42 పాయింట్ల స్కోర్ సాధించింది. త‌ద్వారా అత్యంత శ‌క్తిమంత‌మైన సేఫ్టీ ఫీచ‌ర్ల‌కు పెట్టింది పేరుగా నిలుస్తుందీ కారు.

Tags:    
Advertisement

Similar News