Hyundai Exter | సుపీరియ‌ర్ సేఫ్టీకే క‌స్ట‌మ‌ర్ల మొగ్గు.. హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ బుకింగ్స్ రికార్డ్‌!

Hyundai Exter | గ‌త నెల 10న మార్కెట్లో ఆవిష్క‌రించిన హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ ఎస్‌యూవీ కారు బుకింగ్స్‌లో రికార్డులు నెల‌కొల్పుతున్న‌ది. ప్రీలాంచింగ్ టైంలో 10 వేలు, లాంచింగ్ చేసిన నెల లోపే 50 వేల బుకింగ్స్ న‌మోదు చేసుకున్న‌ది. మెజారిటీ క‌స్ట‌మ‌ర్లు స‌న్‌రూఫ్ వేరియంట్ల వైపే మొగ్గుతున్నారు.

Advertisement
Update:2023-08-11 11:19 IST

Hyundai Exter | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీ కారు `ఎక్స్‌ట‌ర్‌`కు అన్ని వైపుల నుంచి గిరాకీ పెరుగుతోంది. గ‌త నెల 10న దేశీయ మార్కెట్‌లో ఆవిష్క‌రించారు. ప్రీ-లాంచింగ్ బుకింగ్స్ 10 వేలు న‌మోదైతే.. లాంచింగ్ త‌ర్వాత నెల రోజుల్లో 50 వేల బుకింగ్స్ న‌మోద‌య్యాయ‌ని హ్యుండాయ్ మోటార్ తెలిపింది.

సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణిక‌త‌తో కూడిన సుపీరియ‌ర్ సేఫ్టీకి క‌స్ట‌మ‌ర్లు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని హ్యుండాయ్ ఇండియా సీఓఓ త‌రుణ్ గార్గ్ తెలిపారు. హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ అన్ని ట్రిమ్స్‌ల్లో ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), వెహిక‌ల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ) వంటి ఫీచ‌ర్లు ఆప్ష‌న్‌గా ల‌భిస్తాయ‌ని తెలిపారు. క‌స్ట‌మ‌ర్ల ప్రాధాన్యాల‌ను త‌మ ఎక్స్‌ట‌ర్ పున‌ర్నిర్వ‌చిస్తుంద‌న్నారు. ఎక్స్‌ట‌ర్ బుకింగ్స్ త‌మ‌కు ఉల్లాసాన్ని, ఆనందాన్ని క‌లిగిస్తున్నాయ‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన బుకింగ్స్‌లో 75 శాతం స‌న్‌రూఫ్ వేరియంట్ల‌కు ప్రాధాన్యం ఇస్తుంటే.. 33 శాతానికి పైగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ల బుకింగ్స్ ఉన్నాయి.

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ కారు ధ‌ర రూ.5,99,999 నుంచి ప్రారంభ‌మై.. టాప్ హై ఎండ్ వేరియంట్ ధ‌ర రూ.10,09,999 (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. టాటా పంచ్ ధ‌ర రూ.5,99,999 నుంచి రూ.10,09,999 మ‌ధ్య ఉంటుంది.

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ 1.2 లీట‌ర్ల క‌ప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 83 పీఎస్ విద్యుత్‌, 113.8 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వ‌ర్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. సీఎన్జీ వ‌ర్ష‌న్ ఎక్స్‌ట‌ర్ (గ‌రిష్టంగా 69 పీఎస్ విద్యుత్‌, 95.2 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది) 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో వ‌స్తున్న‌ది. హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ లీట‌ర్ పెట్రోల్‌పై మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ 19.4 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ 19.2 కి.మీ, కిలో సీఎన్జీపై 27.1 కి.మీ మైలేజీ ఇస్తుంది.

Tags:    
Advertisement

Similar News