Hyundai Exter | నాలుగు నెల‌ల్లోనే హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ స‌రికొత్త రికార్డు.. స‌క్సెస్‌కు ఇవీ పంచ‌ర‌త్నాలు..!

Hyundai Exter | ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ మార్కెట్లో ప‌ట్టు బిగించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Advertisement
Update:2023-11-22 18:00 IST

Hyundai Exter | ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ మార్కెట్లో ప‌ట్టు బిగించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఎస్‌యూవీ సెగ్మెంట్ (SUV Segment) లో మారుతి సుజుకి (Maruti Suzuki India) కి పోటీ ఇస్తోంది. గ‌త జూలైలో దేశీయ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ (Hyundai Exter) నాలుగు నెల‌ల్లో స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. ఇప్ప‌టికే ల‌క్ష యూనిట్ల‌కు పైగా 5-సీట‌ర్ స‌బ్ కంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌ట‌ర్ (Exter) కార్లు బుక్ అయ్యాయి. 2023 ముగిసేలోగా హ్యుండాయ్ కార్ల విక్ర‌యాలు ఆరు ల‌క్ష‌ల మార్క్‌ను దాట‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

భారత్ మార్కెట్లోకి హ్యుండాయ్ ఇలా

అపార‌మైన‌ పాపుల‌ర్ మోడ‌ల్ కార్లు శాంత్రో (Santro), ఐ10 (i10) ల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చింది హ్యుండాయ్ (Hyundai). ఈ ఏడాదితో భార‌త్‌లోకి ఎంట‌రై 27 ఏండ్లు పూర్త‌వుతుంది. శాంత్రో, ఐ10 వంటి మోడ‌ళ్ల నుంచి ఎస్‌యూవీల వైపు మ‌ళ్ల‌డంతో మ‌రింత పాపులారిటీ పెంచుకున్న‌ది. క్రెటా (Creta), వెన్యూ (Venue) మోడ‌ల్ కార్ల‌తో ప‌వ‌ర్ ప్లేయ‌ర్ల అవ‌తారమెత్తాయి. మ‌రింత చౌక‌గా మార్కెట్‌లోకి వ‌చ్చిన ఎక్స్‌ట‌ర్ (Exter)తో ముందు వ‌రుస‌లోకి దూసుకొస్తున్న‌ది.


ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇలా హ్యుండాయ్‌

భార‌త్ మార్కెట్‌లో స‌బ్ ఫోర్ మీట‌ర్ ఎస్‌యూవీ (Sub-Four-Meter SUV) సెగ్మెంట్‌లో 2019 నుంచి వెన్యూ (Venue) శ‌క్తిమంతంగా సేల్స్ కొన‌సాగుతున్న‌ది. తొలిసారి కారు కొనాల‌ని భావించే వారికి ఎక్స్‌ట‌ర్ (Exter) ఆక‌ర్ష‌ణీయంగా కనిపిస్తోంది. ఎక్స్‌టీరియ‌ర్ స్టైల్‌, క్యాబినెట్ రిలేటెడ్ ఫీచ‌ర్ల‌తో క్యాచీ ధ‌ర‌కే అందుబాటులో ఉండ‌టంతో అంద‌రూ ఎక్స్‌ట‌ర్ (Exter) వైపు మొగ్గుతున్నారు. ఏడు వేరియంట్ల‌లో మార్కెట్లో ఎక్స్‌ట‌ర్ (Exter) అందుబాటులో ఉన్నది. ఇందుకు ప‌లు కీల‌కాంశాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.. !

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ వేరియంట్లు.. ధ‌ర‌వ‌ర‌లు ఇలా

దేశీయ మార్కెట్లో హ్యుండాయ్ మోటార్ ఎక్స్‌ట‌ర్ (Hyundai Exter) మార్కెట్‌లోకి ఆవిష్క‌రించిన‌ప్పుడు దాని ధ‌ర రూ.6 ల‌క్ష‌లు- రూ.10.5 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతోంది. ఈ సెగ్మెంట్‌లో ఇత‌ర కార్ల ధ‌ర‌ల‌తో పోలిస్తే హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఆధ్వ‌ర్యంలోని ఎక్స్‌ట‌ర్ (Exter) తో పోటీ ప‌డే మోడ‌ల్స్ లేవ‌ని ప‌లువురు భావిస్తున్నారు. త‌మ‌కు స‌రిగ్గా ఫిట్‌గా ఉంటుంద‌ని భావిస్తున్న ఏడు వేరియంట్ల‌తో కూడిన ఎక్స్‌ట‌ర్ మోడ‌ల్ కార్లు డిజైన్ చేసింది హ్యుండాయ్ మోటార్‌.

ధ‌ర‌లో అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్న హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ (Hyundai Exter) అప్ప‌ర్ వేరియంట్ల‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉన్నాయి. సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ (six airbags), డ్యుయ‌ల్ వ్యూ డాష్ కెమెరా (dual-view dash camera), స్మార్ట్ ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్ (smart electric sunroof), వైర్‌లెస్ చార్జ‌ర్ (wireless charger) వంటి ఫీచ‌ర్ల‌తో ఎక్స్‌ట‌ర్ (Exter) పోష్‌గా క‌నిపిస్తుంది.


కీల‌క స్పెషిఫికేష‌న్స్‌..

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ (Hyundai Exter)లో డీజిల్ వేరియంట్ ఇవ్వ‌లేదు. 1.2 లీట‌ర్ల పెట్రోల్ మోటార్ 82 హెచ్‌పీ విద్యుత్‌, 95 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్‌, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వ‌స్తుంది. లీట‌ర్ పెట్రోల్‌పై 19.2 కి.మీ మైలేజీ ఇస్తుంది. మ‌రింత మైలేజీ కావాలంటే సీఎన్జీ ఆప్ష‌న్ ఎంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ టార్గెట్‌

భార‌త్ మార్కెట్‌లో హ్యుండాయ్ (Hyundai) ఎంట్రీ లెవ‌ల్ మోడ‌ల్ గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 NIOS) మోడ‌ల్ కారు కొన‌సాగిస్తున్న‌ది. గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 NIOS) మాదిరే ఎక్స్‌ట‌ర్ (Exter) మోడ‌ల్ కారుకు రోజురోజుకు క‌స్ట‌మ‌ర్ల ప్రాధాన్యం పెరుగుతున్న‌ది. కొన్ని స్టైలిష్ డిజైన్ల‌తో యువ‌త‌రానికి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది ఎక్స్‌ట‌ర్ (Exter). ప‌ట్ట‌ణ యువ‌త‌ను ల‌క్ష్యంగా చేసుకుని రూపొందించిందే ఎక్స్‌ట‌ర్‌. దేశ‌వ్యాప్తంగా సేల్స్ అండ్ స‌ర్వీస్ నెట్‌వ‌ర్క్ గ‌ల హ్యుండాయ్ సేల్స్ పెంచుకునేందుకు ఎక్స్‌ట‌ర్ దోహ‌ద ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


 



Tags:    
Advertisement

Similar News