Hyderabad Gold Rate | బ‌క్క‌చిక్కినా `బంగార‌మే`.. జ్యువెల్ల‌రీ కోసం పోటెత్తిన హైద‌రాబాదీలు..!

Hyderabad Gold Rate | ఇటీవ‌ల కాలంలో బంగారం ధ‌ర‌లు రూ.3000 మేర‌కు త‌గ్గ‌డంతో హైద‌రాబాదీలు జ్యువెల్ల‌రీ షాపుల‌కు పోటెత్తారు. గ‌త మార్చిలో 24 క్యార‌ట్ల తులం బంగారం ధ‌ర నిక‌రంగా రూ.60 వేల మార్క్‌ను దాటేసింది.

Advertisement
Update:2023-10-10 08:35 IST

Hyderabad Gold Rate | బ‌క్క‌చిక్కినా `బంగార‌మే`.. జ్యువెల్ల‌రీ కోసం పోటెత్తిన హైద‌రాబాదీలు..!

Hyderabad Gold Rate | భార‌తీయుల‌కు.. అందునా మ‌హిళ‌ల‌కు బంగారం అంటే ఎంతో మ‌క్కువ‌. పండగ‌లు, పెండ్లిండ్లు, కుటుంబ శుభ‌కార్యాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ వీస‌మెత్తు బంగారం కొనుక్కోవ‌డానికే మొగ్గు చూపుతుంటారు. గ‌త మార్చిలో రూ.60 వేల మార్క్‌ను దాటిన బంగారం వారం ప‌ది రోజులుగా రూ.58 వేల కంటే దిగువ‌కు ప‌డిపోయింది. ఇక ఆభ‌ర‌ణాల త‌యారీలో ఉప‌యోగించే 22-క్యార‌ట్ల బంగారం ప‌ది గ్రాములు రూ.53,350 ప‌లుకుతోంది. బంగారం ధ‌ర‌లు దిగి రావ‌డంతో హైదరాబాదీలు ప‌సిడిలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి, ఆభ‌ర‌ణాల కొనుగోళ్ల‌కు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో బంగారం ధ‌ర‌లు రూ.3000 మేర‌కు త‌గ్గ‌డంతో హైద‌రాబాదీలు జ్యువెల్ల‌రీ షాపుల‌కు పోటెత్తారు. గ‌త మార్చిలో 24 క్యార‌ట్ల తులం బంగారం ధ‌ర నిక‌రంగా రూ.60 వేల మార్క్‌ను దాటేసింది. కానీ వారం.. పది రోజుల క్రితం వ‌ర‌కూ డాల‌ర్ బ‌లోపేతం కావ‌డంతో దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో సోమ‌వారం తులం బంగారం రూ.58,200 ప‌లికింది.

ఆభ‌ర‌ణాల త‌యారీలో వినియోగించే 22-క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.53,350 వ‌ద్ద స్థిర ప‌డింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త‌త‌ల‌తో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌క‌ ముందే ప‌లువురు హైద‌రాబాదీ మ‌హిళ‌లు త‌మ‌కు ఇష్ట‌మైన ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసేందుకు జ్యువెల్ల‌రీ దుకాణాల ముందు పోటెత్తారు. పండగ‌ల సీజ‌న్‌లో ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేయ‌డానికి బంగారం నాణాలు, బంగారం క‌డ్డీల‌పై పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మొగ్గు చూపుతున్నారు.

ఇజ్రాయిల్‌-హ‌మాస్ మ‌ధ్య యుద్ధంతో త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో బంగారం ధ‌ర‌లు పుంజుకున్నాయి. ఆభ‌ర‌ణాల త‌యారీలో వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.53,300 ప‌లికితే, 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.440 పుంజుకుని రూ.59,130 వ‌ద్ద స్థిర ప‌డింది. ఇక కిలో వెండి ధ‌ర రూ.72,100 వ‌ద్ద నిలిచింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం మంగ‌ళ‌వారం 1.46 శాతం పుంజుకుని 1859.15 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతున్న‌ది.

Tags:    
Advertisement

Similar News