మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ కోసం ఇలా చేయండి!

అత్యవరసర పరిస్థితుల్లో ఎవరికైనా లోన్ తీసుకోవాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు త్వరగా లోన్ అప్రూవ్ చేయాలంటే మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ ఉండడం అవసరం.

Advertisement
Update:2023-09-25 21:21 IST

మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ కోసం ఇలా చేయండి!

అత్యవరసర పరిస్థితుల్లో ఎవరికైనా లోన్ తీసుకోవాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు త్వరగా లోన్ అప్రూవ్ చేయాలంటే మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ ఉండడం అవసరం. మరి మంచి క్రెడిట్ ఉండేందుకు ఏం చేయాలి?

లోన్లు కేవలం బ్యాంకుల ద్వారానే కాదు, క్రెడిట్‌ కార్డులు, ఫైనాన్స్ యాప్‌లు లేదా ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా కూడా తీసుకోవచ్చు. అయితే ఎందులోనైనా లోన్ తీసుకోవాలంటే దరఖాస్తుదారులకు మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉండాలి. గతంలో తీసుకున్న లోన్స్ లేదా క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐల తిరిగి చెల్లింపుల తీరుని బట్టి ఈ క్రెడిట్ ప్రొఫైల్ మారుతుంటుంది.

క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండేందుకు నిర్ణీత సమయాల్లో తిరిగి చెల్లింపులు చేసేయాలి. లోన్స్ తీసుకునేటప్పుడు సరైన ప్రొడక్ట్‌ను ఎంచుకోవాలి. ఎలాంటి అవసరాలు ఉన్నాయో సంస్థలకు చెప్పి దాన్ని బట్టి లోన్స్ ప్లాన్ చేసుకోవాలి. అదికూడా సకాలంలో చెల్లింపులు చేయగలం అనుకున్నప్పుడే లోన్స్ జోలికి వెళ్లాలి. ప్రీ-అప్రూవ్డ్‌ లోన్ ఆఫర్స్ ఉన్నాయి కదా అని తీసుకోకూడదు. దీనివల్ల క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బ తింటుంది.

క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు అవసరానికి అనుగుణంగా వాటిని తీసుకోవాలి. సంస్థ ఆఫర్ చేసింది కదా అని ఎక్కువ కార్డులు తీసుకుని వాడకుండా ఖాళీగా పెట్టుకోవడం వల్ల క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బ తింటుంది.

ఫైనాన్స్ సంస్థలకు డేటా ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయకూడదు. ఇలా ఎంటర్ చేయడం ద్వారా మీ వివరాలు రకరకాల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు చేరుతుంది. దాంతో వాళ్లు ఏదో ఆఫర్ పేరుతో ప్రొడక్ట్ తీసుకోమని ప్రేరేపించే అవకాశం ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో లోన్‌ తీసుకునే ముందు క్రెడిట్‌ స్కోర్‌ను తప్పక చెక్‌ చేసుకోవాలి. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నప్పుడు వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. లేదా అప్లై చేసిన సంస్థ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇలా సంస్థలు దరఖాస్తును తిరస్కరించడం ద్వారా కూడా క్రెడిట్ ప్రొఫైల్ తగ్గుతుంటుంది. అలాగే తక్కువ కాలంలో ఎక్కువ లోన్‌లకు అప్లై చేయడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది.

ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం అవసరం. కాబట్టి దాని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీనైనన్ని తక్కువ లోన్లు తీసుకుంటూ సకాలంలో చెల్లిస్తూ ఉండాలి.

Tags:    
Advertisement

Similar News