Gold Rates | బంగారం కొత్త పుంతలు.. దీపావళికి రూ.63 వేల మార్క్ దాటేస్తుందా.. కారణాలివేనా?!
Gold Rates | బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం.. బంగారం కొంటే లక్ష్మీ దేవి ఇంట్లో ఉంటుందని భారతీయ మహిళల నమ్మకం.. విశ్వాసం.. అందుకే పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు, పండుగలు.. ప్రత్యేకించి అక్షయ తృతీయ.. దంతేరాస్.. దీపావళికి తమ కుటుంబ ఆర్థిక వనరులను బట్టి బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు.
Gold Rates | బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం.. బంగారం కొంటే లక్ష్మీ దేవి ఇంట్లో ఉంటుందని భారతీయ మహిళల నమ్మకం.. విశ్వాసం.. అందుకే పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు, పండుగలు.. ప్రత్యేకించి అక్షయ తృతీయ.. దంతేరాస్.. దీపావళికి తమ కుటుంబ ఆర్థిక వనరులను బట్టి బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, భారతీయుల అవసరాలకు సరిపడా బంగారం కావాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కనుక వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా, డాలర్ విలువ పతనం అయినా, ముడి చమురు ధర పెరిగినా, బులియన్ మార్కెట్‌లో బంగారానికి గిరాకీ పెరుగుతుంది. ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్‌గా బంగారాన్ని ఎంచుకుంటారు. మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా హమాస్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. దీనికి తోడు దేశీయంగా పండుగల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధర వడివడిగా పైపైకి దూసుకెళ్తున్నది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారట్స్) రూ.700 పెరిగి రూ.62,950 పలికింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.650 వృద్ధి చెంది రూ.57,700 వద్ద నిలిచింది. పరిస్థితులు ఇలాగే ఉంటే దంతేరాస్, దీపావళి నాటికి రూ.63 వేల మార్క్‌ను దాటేస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు, ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2006.18 డాలర్ల వద్ద నిలిచింది. శనివారంతో పోలిస్తే ఆదివారం 21.36 డాలర్లు వృద్ధి చెందింది. కిలో వెండి ధర రూ.77,500 పలుకుతోంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.660 పెరిగి రూ.62,620 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.600 పెరిగి రూ.57,400లకు చేరుకున్నది. కిలో వెండి రూ.77,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.660 వృద్ధితో రూ.62,770 వద్ద పలుకుతుంటే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.600 పెరిగి రూ.57,500 వద్ద ముగిసింది. మరోవైపు, కిలో వెండి రూ.74,600 వద్ద స్థిర పడింది.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైతోపాటు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 24 క్యారట్ల బంగారం ధర రూ.660 వృద్ధితో రూ.62,620 పలికింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.57,400 వద్ద నిలకడగా సాగుతున్నది. కానీ, కిలో వెండి ధర రూ.750 తగ్గి రూ.73 వేల వద్ద నిలిచింది. ముంబైలో కిలో వెండి రూ.74,600 వద్ద స్థిరంగా ఉంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో 24 క్యారట్ల బంగారం తులం రూ.660 వృద్ధితో 62.620లకు చేరుకుంటే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం తులం రూ.600 పెరిగి రూ.57,400 పలికింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.74,600 వద్ద స్థిరంగా ఉంది.