నేడు (16-12-2022) తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold, silver price today: దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.310 మేర తగ్గి రూ.49,990కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.54,530కి చేరుకుంది.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది అర్థం కాకుండా ఉంది. సాధారణంగా మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ.. ఇంకొన్ని సార్లు స్థిరంగా ఉంటాయి. నిన్న రూ.550 మేర పెరిగిన బంగారం ధరకు నేడు బ్రేక్ పడింది. పెరిగినంతగా తగ్గకున్నా కూడా పసిడి, వెండి ధరలకు మాత్రం రివర్స్ గేర్ పడింది. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.310 మేర తగ్గి రూ.49,990కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.54,530కి చేరుకుంది. దేశీయంగా కిలో వెండి ధర నిన్న రూ.2000 పెరగ్గా.. నేడు రూ.1300 మేర తగ్గి.. రూ.72,700 లకు చేరింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,900.. రూ.54,530
విజయవాడలో రూ.49,900.. రూ.54,530
విశాఖపట్నంలో రూ.49,900.. రూ.54,530
చెన్నైలో రూ.50,600.. రూ.55,200
కోల్‌కతాలో రూ.49,900.. రూ.54,530
బెంగళూరులో రూ.50,040.. రూ.54,580
కేరళలో రూ.49,900.. రూ.54,530
ఢిల్లీలో రూ.50,140.. రూ.54,670
ముంబైలో రూ.490,900.. రూ.54,670
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700
విజయవాడలో రూ.77,700
విశాఖపట్నంలో రూ.74,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700
బెంగళూరులో రూ.72,700
కేరళలో రూ.72,700
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,500
ముంబైలో కిలో వెండి ధర రూ.70,500