తమిళనాడులో ఫాక్స్‌ కాన్‌ రూ.13,180 కోట్ల పెట్టుబడి

14 కొత్త పరిశ్రమల స్థాపనకు కేబినెట్‌ ఆమోదం

Advertisement
Update:2024-10-08 17:40 IST

ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజ సంస్థ ఫాక్స్‌ కాన్‌ తమిళనాడులో రూ.13,180 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మంగళవారం సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఫాక్స్‌ కాన్‌ పెట్టుబడులకు ఆమోదముద్ర వేశారు. తమిళనాడులో 14 కొత్త పరిశ్రమల స్థాపనకు ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, డిఫెన్స్‌, ఫార్మా, నాన్‌ లెదర్‌ ఫుట్‌వేర్‌, రెనెవబుల్‌ ఎనర్జీ, టెలికాం రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. కొత్త పరిశ్రమలతో తమ రాష్ట్రంలో 46,931 ఉద్యోగాలు వస్తాయని కేబినెట్‌ వెల్లడించింది. తమిళనాడులోని రానిపట్‌ లో టాటా మోటార్స్‌, కాంచిపురంలో ఫాక్స్‌ కాన్‌ అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయని పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News