ఆమ్దానీలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు ఫోర్త్‌ ప్లేస్‌

టాప్‌ లో ఢిల్లీ.. సెకండ్‌ ప్లేస్‌ లో హౌరా స్టేషన్‌లు

Advertisement
Update:2024-10-07 16:07 IST

ఆమ్దానీలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దేశంలోనే నాలుగో ప్లేస్‌ దక్కించుకుంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక ఆదాయం సాధించిన టాప్‌ -100 రైల్వే స్టేషన్‌ల జాబితాను కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. రూ.3,337 కోట్ల ఆదాయంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌ లోని హౌరా స్టేషన్‌ రూ.1,692 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడులోని చెన్నై సెంట్రల్‌ ఏటా రూ.1,299 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు ఏడాదికి రూ.1,276 కోట్ల ఆదాయం వస్తోంది. ఢిల్లీ శివారుల్లోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ ఏటా రూ.1,227 కోట్లు, ముంబైలోని లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ రూ.1,036 కోట్లు, గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ స్టేషన్‌ రూ.1,010 కోట్లు, మహారాష్ట్రలోని ముంబై సీఎస్‌టీ స్టేషన్‌ రూ.982 కోట్ల ఆదాయంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకల్లో మాత్రం ముంబైలోని థానే రైల్వే స్టేషన్‌ 93.06 కోట్ల మందితో టాప్‌ ప్లేస్‌ లో ఉంది. ముంబైలోని కళ్యాణ్‌ రైల్వే స్టేషన్‌ లో 83.79 కోట్ల ప్రయాణికులతో రెండో స్థానంలో ఉంది. హౌరా రైల్వే స్టేషన్‌ నుంచి ఏటా 61.32 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఏటా 39,36 కోట్లు, చెన్నై సెంట్రల్‌ నుంచి 30.59 కోట్లు, సికింద్రాబాద్‌ నుంచి 27.77 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News