బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఇది తెలుసుకోండి!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’, కన్సల్టింగ్‌ కంపెనీ ‘బైన్‌’ కలిపి సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో.. మనదేశంలో బయటి ఫుడ్ వినియోగం ఎక్కువ అయినట్టు వెల్లడైంది.

Advertisement
Update:2024-07-06 06:00 IST

మనదేశంలో ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్డే ఎక్కువగా తింటున్నారని తాజా స్టడీల్లో తేలింది. బయటి ఫుడ్‌కు అలవాటవుతున్న వాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోందట. మరి ఈ అలవాటు వల్ల లాభమా ? నష్టమా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’, కన్సల్టింగ్‌ కంపెనీ ‘బైన్‌’ కలిపి సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో.. మనదేశంలో బయటి ఫుడ్ వినియోగం ఎక్కువ అయినట్టు వెల్లడైంది. ఫుడ్ సర్వీసుల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 5.5 లక్షల కోట్లుగా ఉందట. ఫుడ్ డెలివరీ సర్వీసులకు సుమారు 33 కోట్ల కస్టమర్లు ఉన్నారట. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య 45 కోట్లకు చేరుతుందని స్టడీలు చెప్తున్నాయి. ఫ్యూచర్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

బయట ఫుడ్ లేదా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లకు ఎక్కువ అలవాటు అవ్వడం ద్వారా వ్యక్తుల ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బయట తినడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయంటే..

ఇంట్లో తినే ఆహారంతో పోలిస్తే బయట దొరికే ఫుడ్‌లో ఎక్కువ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. వంటకు ఏయే పదార్థాలు వాడతారు? అవి ఎంత వరకూ సేఫ్? అన్న విషయంలో స్పష్టత ఉండదు.

బయట దొరికే ఫుడ్ తయారీలో రెడీమేడ్, ప్యాక్డ్ ఇంగ్రెడియంట్స్ వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాగే అందంగా కనిపించడం కోసం రెస్టారెంట్ ఫుడ్స్‌లో వాడే కలర్ ఏజెంట్స్‌లో కొన్ని క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి

రెస్టారెంట్ ఫుడ్స్‌లో రంగు, రుచికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రుచి కోసం ఎక్కువ ఉప్పు, ఎక్కువ షుగర్స్, మంచి లుక్ కోసం ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ వంటివి వాడుతుంటారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేవే.

బయట ఫుడ్‌కు అలవాటు అవ్వడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇకపోతే నిపుణులు ప్రకారం నెలకు మూడు లేదా నాలుగు సార్లు బయట ఫుడ్ లేదా ఆన్ లైన్ ఫుడ్ తినడం సేఫ్‌గా భావించొచ్చు.

Tags:    
Advertisement

Similar News