Flipkart Big Billion Days Sale | రూ.10 వేల లోపు టాప్ స్మార్ట్ ఫోన్ల‌పై ఆఫ‌ర్లు ఇలా..!

Flipkart Big Billion Days Sale | పండుగ‌ల సీజ‌న్ వ‌చ్చేసింది. దాంతోపాటు ఈ-కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ‌ల్ సేల్స్ `ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్ శ‌నివారం అర్థ‌రాత్రి నుంచి ప్రారంభం అవుతాయి.

Advertisement
Update:2023-10-07 09:00 IST

Flipkart Big Billion Days Sale | పండుగ‌ల సీజ‌న్ వ‌చ్చేసింది. దాంతోపాటు ఈ-కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ‌ల్ సేల్స్ `ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్ శ‌నివారం అర్థ‌రాత్రి నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు శుక్ర‌వారం అర్థ‌రాత్రి నుంచే అందుబాటులోకి వ‌చ్చాయి. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ప్ర‌తి భార‌తీయుడి వ‌ద్ద‌ స్మార్ట్ ఫోన్ త‌ప్ప‌నిస‌రి.. అందునా ఇప్పుడు 5జీ సేవ‌లు వ‌చ్చేశాయి. 5జీ సేవ‌ల‌ను అందుకునేందుకు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌లో స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాల‌నుకునే వారికి మంచి త‌రుణం. ప‌లు ఫోన్ల‌పై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫ‌ర్ల‌తో ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్‌లో పొకో సీ51, ఇన్‌ఫినిక్స్ హాట్ 30ఐ, పొకో సీ55, రియ‌ల్‌మీ సీ 51, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌04, రెడ్‌మీ 12, రియ‌ల్‌మీ సీ53, పొకో ఎం6 ప్రో 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14 5జీ ఫోన్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చే డిస్కౌంట్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తోనూ జ‌రిపే లావాదేవీలు, ఈఎంఐ ఆప్ష‌న్ల‌పైనా అద‌న‌పు డిస్కౌంట్‌లు ల‌భిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రూ.10 వేల లోపు ధ‌ర‌కు ల‌భిస్తున్న స్మార్ట్ ఫోన్ల‌పై ఓ లుక్కేద్దామా..!

రూ.10 వేల లోపే పొకో ఎం6 ప్రో 5జీ

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పొకో త‌న పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.12,999 కాగా, ఇప్పుడు రూ.9999ల‌కే అందిస్తున్న‌ది. స్నాప్‌డ్రాగ‌న్ 4 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తున్న‌ది. ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ అండ్ షియోమీ ఎంఐయూఐ వ‌ర్ష‌న్‌తో ప‌ని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.79 అంగుళాల డిస్‌ప్లే క‌లిగి ఉంట‌ది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తోకూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. 18 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న‌ది.

చౌక‌గా రియ‌ల్‌మీ సీ51

గ‌త నెల‌లో రియ‌ల్ మీ బ‌డ్జెట్ సెగ్మెంట్‌లో విడుద‌ల చేసిన స్మార్ట్ ఫోన్ రియ‌ల్‌మీ సీ51. దీని లాంచింగ్ ధ‌ర రూ.8,999 కాగా, ఇప్పుడు రూ.7,999ల‌కే అందిస్తున్న‌ది. 6.74 అంగుళాల డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటది. యూనిసోక్ టీ 612 చిప్ సెట్‌తో వ‌స్తున్న ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. 33 వాట్ల ఆర్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ కూడా జ‌త చేశారు. 50-మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తోపాటు డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14 5జీ ఇలా

ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం శాంసంగ్ గ‌త మార్చిలో ఆవిష్క‌రించిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14 5జీ ఫోన్ ఎక్స్‌నోస్ 1330 చిప్‌సెట్‌తో వ‌స్తున్న‌ది. 6 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా ల‌భిస్తుంది. 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వ‌న్ యూఐ 5 ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌, ఏడాది పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతాయి. ఈ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.14,990 కాగా, తాజా సేల్స్‌లో రూ.11,499ల‌కు ల‌భిస్తుంది.

బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ పొకో సీ51

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పోకో.. బ‌డ్జెట్ సెగ్మెంట్‌లో మ‌రో ఫోన్ పొకో సీ51 ఫోన్ గ‌త ఏప్రిల్‌లో రూ.8,499ల‌కే మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. ఇప్పుడు కేవ‌లం రూ.5,999ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిష‌న్‌) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్‌తో విత్ 64 జీబీ ఇంంట‌ర్న‌ల్ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. 8-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఈ ఫోన్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవ‌చ్చు.

ఇలా ఇన్‌ఫినిక్స్ హాట్ 30ఐ

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ త‌న ఇన్‌ఫినిక్స్ హాట్ 30 ఐ ఫోన్.. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తున్న‌ది. మీడియా టెక్ హెలియో జీ37 చిప్ సెట్‌, 6.6 అంగుళాల డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. 10వాట్ల చార్జ‌ర్‌తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న ఈ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.8,999 కాగా, ఇప్పుడు రూ.7,999ల‌కు ల‌భిస్తుంది.

పొకో సీ55 ఫోన్ ఇలా

గ‌త ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పొకో ఆవిష్క‌రించిన పొకో సీ55 ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.10,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో రూ.7,999ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు. 6.71 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ డిస్‌ప్లే తో వ‌స్తున్న పొకో సీ55 ఫోన్‌. 534 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్‌సెట్‌, 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా, 10 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది.

ఇలా రియ‌ల్‌మీ 12

ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ త‌న రియ‌ల్‌మీ 12 ఫోన్ గ‌త ఆగ‌స్టులో మార్కెట్‌లో ఆవిష్క‌రించారు. దీని లాంచింగ్ ధ‌ర రూ.8,999 కాగా, రూ.8,099ల‌కే ల‌భిస్తున్న‌ది. 6.79 అంగుళాల డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్‌సెట్‌, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తున్న‌ది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 18 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఉంటుంది.

రియ‌ల్‌మీ సీ53

రియ‌ల్ మీ సీ53 ఫోన్ 108 మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరాతో వ‌స్తున్న‌ది. ఈ ఫోన్ 6.74 అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 180 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్ క‌లిగి ఉంటుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ గ‌ల ఈ ఫోన్ మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ సామ‌ర్థ్యం పెంచుకోవ‌చ్చు. యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ గ‌ల ఈ ఫోన్ 18 వాట్ల చార్జింగ్ మ‌ద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఉంటుంది.

ఎంట్రీ లెవ‌ల్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌04

ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం శాంసంగ్ ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్క‌రించిన ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌04. మీడియాటెక్ హెలియో పీ35 ఎస్వోసీ చిప్‌సెట్‌, 4జీబీ రామ్ క‌లిగి ఉంటుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 12- మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫేస్ అన్ లాక్ ఆప్ష‌న్‌తోపాటు 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ జ‌త చేశారు. లాంచింగ్ ధ‌ర రూ.7,499 కాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్‌లో రూ.6,499ల‌కే అందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News