Car Sales | ఎస్‌యూవీలకు డిమాండ్.. జూలైలో కార్ల సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు..
Car Sales | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా కుటుంబ సభ్యులంతా ప్రయాణించేందుకు వీలుగా.. విశాలంగా ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) కార్లపై మోజు పెంచుకుంటున్నారు.
Car Sales | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా కుటుంబ సభ్యులంతా ప్రయాణించేందుకు వీలుగా.. విశాలంగా ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) కార్లపై మోజు పెంచుకుంటున్నారు. గత కొంతకాలంగా కార్ల సేల్స్ క్రమంగా పెరిగిపోతున్నాయి. జూలై కార్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. డిస్పోజబుల్ ఇన్ంపై వత్తిడితో బుల్లి కార్ల విక్రయాలు తగ్గినా, టూ వీలర్స్ సేల్స్ బలహీనంగా ఉన్నా.. ఎంట్రీ లెవల్ కార్ల సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి.
ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం గత నెలలో 3,50,149 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది (2022)తో పోలిస్తే 3,41,370 యూనిట్ల నుంచి 2.6 శాతం పెరిగింది. బలమైన ఆర్థిక పరిణామాలతోపాటు సానుకూల వర్షకాల ప్రభావంతో వినియోగదారుల డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందని సియామ్ అంచనా వేసింది. ఈ నెల 20న కేరళలో ఓనం పర్వదినాలతో ఫెస్టివ్ సీజన్‌లో అన్ని సెగ్మెంట్ల కార్ల సేల్స్‌కు డిమాండ్ పెరుగుతుందని సియామ్ పేర్కొంది.
2023 జూలై కార్ల సేల్స్ ఆల్‌టైం రికార్డ్ నెలకొల్పాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు. 2022 జూలైతో పోలిస్తే కార్ల విక్రయాలు 2.6 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే త్రీ వీలర్స్ సేల్స్‌లో 78.9 శాతం గ్రోత్ నమోదైంది. 2018-19 తర్వాత రెండో సారి గరిష్ట సేల్స్ నమోదయ్యాయని రాజేశ్ మేనన్ వెల్లడించారు.
Car Sales | గతేడాదితో పోలిస్తే 2023 జూలై కార్ల సేల్స్‌లో ఆల్‌టైం రికార్డు నమోదైంది. 2022తో పోలిస్తే 2.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు 3,50,149 యూనిట్లకు చేరాయని సియామ్ తెలిపింది. గతంతో పోలిస్తే ఎస్‌యూవీ కార్లకు గిరాకీ పెరుగుతోందని పేర్కొంది.