ఐఆర్‌సీటీసీ ఇ–టికెట్, ఐ–టికెట్.. వీటి ప్రత్యేకతలేంటంటే..
చాలామంది టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. అందుకే ప్రయాణీకులు సులువుగా రిజర్వేషన్ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ఇ–టికెట్స్, ఐ–టికెట్స్ పేరుతో కొత్త విధానాలను తీసుకొచ్చింది.
మనదేశంలో ట్రైన్ జర్నీ అనేది చాలా కామన్. ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే ట్రైన్ టికెట్లు ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం అంత సింపుల్ కాదు. చాలామంది టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. అందుకే ప్రయాణీకులు సులువుగా రిజర్వేషన్ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ఇ–టికెట్స్, ఐ–టికెట్స్ పేరుతో కొత్త విధానాలను తీసుకొచ్చింది.
కౌంటర్‌కు వెళ్లి టికెట్ కొనుక్కునే పని లేకుండా ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ టికెట్ బుక్ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ కొత్త సర్వీసును అందిస్తోంది. ఇ–టికెట్‌ను ప్రయాణం చేసే ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రింటెడ్ రూపంలో ఉండదు. ఆన్‌లైన్ రూపంలో ఉంటుంది. ఇ–టికెట్‌తో ప్రయాణం చేసేటప్పుడు వెంట గుర్తింపు కార్డుని తీసుకెళ్లాలి. సీట్ నెంబర్, బెర్త్ కూడా ముందే సెలక్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే క్యాన్సిలేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు.
ఇక ఐ–టికెట్ విషయానికొస్తే.. ఇది పూర్తిగా ప్రింటెడ్ రూపంలో ఉంటుంది. కానీ, ఇది కౌంటర్‌లో లభించే టికెట్ కాదు. ఐ–టికెట్ కొరియర్ ద్వారా ఇంటికొస్తుంది. దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకుంటే ప్రయాణానికి ముందు రోజు ఇంటికొస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేయాలంటే మళ్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంటుంది.