Best SUV Cars | నెక్సాన్ టు బ్రెజా అండ్ ఎక్స్‌యూవీ300.. ఏ ఎస్‌యూవీ బెస్ట్‌..!

Best SUV Cars | టెక్నాల‌జీ ప‌రంగా ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్లు, రెండోద‌శ బీఎస్‌-6 ప్ర‌మాణాల‌కు అనుగుణంగా కార్ల డిజైన్‌, సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో ప‌లు కార్ల త‌యారీ సంస్థ‌లు ఎస్‌యూవీల‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీ ప‌డుతున్నాయి.

Advertisement
Update:2023-08-15 12:15 IST

Best SUV Cars | కొవిడ్‌-19 త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. హ్యాచ్‌బ్యాక్‌.. ఎంట్రీ లెవ‌ల్ కార్ల‌తో పోలిస్తే విశాలంగా ఉన్న ఎస్‌యూవీ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంత‌కుముందుతో పోలిస్తే గ‌త నెల మొత్తం కార్ల విక్ర‌యాల్లో ఎస్‌యూవీ మోడ‌ల్ కార్ల సేల్స్ పెరిగాయి. ఉద్గారాల నియంత్ర‌ణ‌కు రెండోద‌శ బీఎస్‌-6 ప్ర‌మాణాల అమ‌లుతోపాటు పెట్రోల్‌, డీజిల్ వేరియంట్ల మ‌ధ్య ఖ‌ర్చు తేడాతో పెట్రోల్ వేరియంట్ ఎస్‌యూవీ కార్ల‌కు గిరాకీ పెరుగుతున్న‌ది. కంపాక్ట్ పెట్రోల్ ఎస్‌యూవీ కార్ల ధ‌ర‌లు, ఇంజిన్ స్పెషిఫికేష‌న్స్‌, ప్ర‌త్యేకించి అన్నింటిలోనూ ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్‌, రేర్ ఏసీ వంటి ఫీచ‌ర్లు ఉండ‌టంతో ప్ర‌తి ఒక్క‌రూ వీటిని ఎంచుకుంటున్నారు. దేశంలో ప్ర‌స్తుతం అమ్ముడ‌వుతున్న బెస్ట్ ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం..!

బెస్ట్ కంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌

ప్ర‌స్తుతం దేశంలో అమ్ముడ‌వుతున్న బెస్ట్ కంపాక్ట్ ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒక‌టి. ప‌లు వేరియంట్ల‌లో అందుబాటులో ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. నెక్సాన్ ఎస్‌యూవీ కారు ధ‌ర రూ.8 ల‌క్ష‌ల నుంచి రూ.13.2 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంది. నెక్సాన్ కారు ఇంజిన్ 1.2-లీట‌ర్ల పెట్రోల్ కెపాసిటీ క‌లిగి ఉండ‌టంతోపాటు గ‌రిష్టంగా 118బీహెచ్‌పీ విద్యుత్‌, 170ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది.

సెక్యూరిటీ ప‌రంగా గ్లోబ‌ల్ ఎన్‌క్యాప్ 5-స్టార్ రేటింగ్ అందుకున్న తొలి కంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌. డ్యుయ‌ల్ ఎయిర్‌బ్యాగ్స్,ట‌చ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ విత్ స్మార్ట్ ఫోన్ క‌నెక్టివిటీ, క‌నెక్టెడ్ టెక్, నేవిగేష‌న్‌, స‌న్‌రూఫ్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. ప్రాక్ట‌క‌ల్‌గా డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండ‌టంతోపాటు క్వాలిటీ బాగుంటుంది.



కంపాక్ట్ ఎస్‌యూవీల్లో రెండో స్థానం వెన్యూ

క్రెటా త‌ర్వాత దేశంలో అమ్ముడ‌వుతున్న బెస్ట్ కంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల‌లో హ్యుండాయ్ వెన్యూకు రెండో స్థానం ఉంటుంది. విల‌క్ష‌ణ స్టైలింగ్‌తో ప్రాక్టిక‌ల్‌గా డ్రైవింగ్‌కు అనుకూల‌మైన కారు.. ప‌లు ర‌కాల ఫీచ‌ర్ల‌తో నిండిన మోడ‌ల్ వెన్యూ. ఈ కారు 1.2 లీట‌ర్ల పెట్రోల్ మోటార్ / 1.0 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ప‌ని చేస్తుంది. పెట్రోల్ మోటార్ ఇంజిన్ గ‌రిష్టంగా 82 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం టార్చి, ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ గ‌రిష్టంగా 118 బీహెచ్‌పీ, 172 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, ఐఎంటీ, డీసీటీ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భ్యం అవుతుంది.

హ్యుండాయ్ వెన్యూ న్యూ వ‌ర్ష‌న్‌లో స్మార్ట్ స‌న్‌రూఫ్‌, వాయిస్ యాక్టివేటెడ్, డ్యుయ‌ల్ చానెల్ డాష్ కామ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. మ‌ల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్స్‌, వాయిస్ క‌మాండ్స్‌, క‌నెక్టెడ్ కార్ టెక్ వంటి ప‌లు ఫీచ‌ర్లు జ‌త చేశారు. ఈ కారు ధ‌ర రూ.7.72 ల‌క్ష‌ల నుంచి రూ.13.18 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంది. పంచీ ఇంజిన్‌తోపాటు ప‌లు ర‌కాల ఫీచ‌ర్లు దీని ప్ర‌త్యేక‌త‌.



కుర్రాళ్ల‌కు ఆక‌ర్ష‌నీయం కియా సొనెట్‌

హ్యుండాయ్ వెన్యూ ప్లాట్‌ఫామ్‌పైనే రూపుదిద్దుకున్న‌ది కియా సొనెట్‌. ప‌వ‌ర్‌ట్రైన్‌, గేర్‌బాక్స్ చాయిస్ గ‌ల కియా సొనెట్‌కు, హ్యుండాయ్ వెన్యూకు డిజైనింగ్‌లో చాలా తేడాలు ఉన్నాయి. కుర్ర‌కారును ఆక‌ర్షించేలా కియా సొనెట్ ఫీచ‌ర్లు ఉంటాయి. కియా సొనెట్ కారు ధ‌ర రూ.7.79 ల‌క్ష‌ల నుంచి రూ.13.89 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంది. వెన్యూలో మాదిరి ఫీచ‌ర్లే కియా సొనెట్‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో కియా సొనెట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లో అందుబాటులోకి రాబోతున్న‌ది. కంఫ‌ర్ట‌బుల్‌గా, సౌక‌ర్య‌వంతమైన సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో ల‌భిస్తుంది. స్టైలింగ్ మొద‌లు ఫీచ‌ర్లు, ఇంజిన్ డిజైన్ కుర్ర‌కారుకు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది.



ప‌లు ఫీచ‌ర్ల మిశ్ర‌మం మారుతి బ్రెజా

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి త‌న పాపులర్ ఎస్‌యూవీ కారు బ్రెజా ఇటీవ‌లే న్యూ డిజైన్‌తో అప్‌డేట్ అయింది. ఇటీవ‌లే మార్కెట్లో ఆవిష్క‌రించిన జిమ్నీతో ప‌లువురు క‌స్ట‌మ‌ర్లు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. జిమ్నీతో ఏ ప్రాంతానికైనా దూసుకెళ్ల‌వ‌చ్చు. బ్రెజా నిల‌క‌డ‌గా దూసుకెళ్లేలా డిజైన్ చేశారు. మారుతి బ్రెజా కారు ధ‌ర రూ.8.29 ల‌క్ష‌ల నుంచి రూ.14.14 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంది. 1.2 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ సీఎన్జీ ఆప్ష‌న‌ల్ చాయిస్ ఉంటుంది. తొలిసారి మారుతి బ్రెజా స‌న్‌రూఫ్‌తో అందుబాటులోకి వ‌స్తున్న‌ది. క‌నెక్టెడ్ కారు టెక్‌, స్మార్ట్‌వాచ్ కంపాటిబిలిటీ, హెడ్ అప్ డిస్‌ప్లే వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. మాన్యువ‌ల్, టార్చ్ క‌న్వ‌ర్ట‌ర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ గ‌ల మారుతి బ్రెజా.. అత్యంత పాపుల‌ర్ ఎస్‌యూవీ కారుగా నిలుస్తుంది. స‌న్‌రూఫ్‌తోపాటు గ‌తానికంటే మెరుగైన ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న‌ది బ్రెజా.

 


న్యూ వేరియంట్‌ల‌తో ఆక‌ర్ష‌ణీయం మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా డిజైన్ చేసిన ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ కారు ఓవ‌ర్‌లుక్ చేసినట్లు క‌నిపిస్తున్నా.. మ‌హీంద్రాలోనే బెస్ట్ సెల్లింగ్ కారు ఇది. నూత‌న వేరియంట్ల రాక‌తో మ‌రింత మంది క‌స్ట‌మ‌ర్ల పునాదిని ఆక‌ట్టుకునేందుకు మ‌హీంద్రా కృషి చేస్తున్న‌ది. దీని ధ‌ర రూ.7.99 ల‌క్ష‌ల నుంచి రూ.13.44 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంది. ఈ కారు 109 బీహెచ్‌పీ 1.2-లీట‌ర్ల ఇంజిన్‌, 129 బీహెచ్‌పీ 1.2 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఇత‌ర కార్ల‌లో మాదిరిగా ఉన్న ఫీచ‌ర్లే ఎక్స్‌యూవీ300 ఆఫ‌ర్ చేస్తోంది. స్టీరింగ్ వీల్‌లో మోడ్స్‌, పంచీ ఇంజిన్ వంటి ఫీచ‌ర్లు.. ఎక్స్‌యూవీ300 కారును బెస్ట్ ఎస్‌యూవీ కారుగా నిలుపుతున్నాయి. ఎక్స్‌యూవీ300 టాప్ హై ఎండ్ వేరియంట్‌లో సేఫ్టీకోసం ఏడు ఎయిర్ బ్యాగ్స్ జ‌త చేశారు. శ‌క్తిమంత‌మైన ఇంజిన్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్లే అంద‌రికీ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోందీ కారు.




Tags:    
Advertisement

Similar News