బజాజ్ నుంచి సీఎన్‌జీ బైక్! పెట్రోల్ కంటే బెటరేనా?

ప్రముఖ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్.. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) బైక్‌ను రిలీజ్ చేసింది.

Advertisement
Update:2024-07-06 20:00 IST

ప్రముఖ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్.. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) బైక్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలుస్తున్న ఈ బైక్ ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్‌జీకు అయ్యే ఖర్చు తక్కువ. అందుకే ఆటోలు, కార్లలో సీఎన్‌జీ వేరియంట్స్‌ను కూడా తీసుకొస్తుంటాయి కంపెనీలు. అయితే మొదటిసారిగా సీఎన్‌జీతో నడిచే బైక్ ను తయారుచేసింది బజాజ్. ‘బజాజ్ ఫ్రీడమ్‌ 125’ పేరుతో రీసెంట్‌గా ఈ బైక్ మార్కెట్లో లాంఛ్ అయింది.

‘బజాజ్ ఫ్రీడమ్‌ 125’ సీఎన్‌జీ బైక్‌లో రెండు ఫ్యుయెల్ ఆప్షన్స్ ఉంటాయి. పెట్రోల్ లేదా సీఎన్‌జీ మధ్య ఆప్షన్స్ స్విచ్ చేసుకోవచ్చు. సీఎన్‌జీ ఆప్షన్ ద్వారా యూజర్లు తమ ఫ్యుయెల్ ఖర్చును 50 శాతం మేర తగ్గించుకోవచ్చని కంపెనీ చెప్తోంది. సీఎన్‌జీ ఆప్షన్ ద్వారా కిలోమీటర్‌కు రూపాయి కంటే తక్కువ ఖర్చుతోనే బండి నడపొచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. నార్మల్ బైక్‌కు ఉండే అన్ని ఫీచర్చు ఇందులో ఉన్నాయి.

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌లో డ్రమ్‌, డ్రమ్‌ ఎల్‌ఈడీ, డిస్క్‌ ఎల్‌ఈడీ అను మూడు వేరియంట్లు ఉన్నాయి. బైక్‌లో సీఎన్‌జీ, పెట్రోల్‌ కోసం వేర్వేరుగా రెండు ఫ్యుయెల్ ట్యాంకులుంటాయి. వీటి కోసం వేర్వేరు స్విచ్‌లు కూడా ఉంటాయి. ఏ మోడ్ ఆన్‌ చేస్తే ఆ మోడ్‌లో బైక్‌ నడుస్తుంది. రెండు కేజీల సీఎన్‌జీ ట్యాంక్..దాదాపు 200 కిలోమీటర్ల మైలైజ్ ఇస్తుంది. అలాగే రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సుమారు 130 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రెండు ట్యాంక్‌లను ఫుల్‌ చేస్తే సుమారు 330 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.

బజాజ్ ఫ్రీడమ్ బైక్.. 125 సీసీ ఇంజిన్‌తో తయారైంది. ఇది 9.3 బీహెచ్‌పీ పవర్, 9.7 ఎన్‌ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, సీబీఎస్ బ్రేకింగ్ వంటి ఫీచర్లున్నాయి. డ్రమ్‌ వేరియంట్ ధర రూ.95,000, డ్రమ్‌ విత్ ఎల్‌ఈడీ బైక్‌ ధర రూ.1,05,000. డిస్క్‌ విత్ ఎల్‌ఈడీ ధర రూ.1,10,000 ఉంటుంది. బ్లాక్‌, బ్లూ, వైట్‌, రెడ్‌, గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News