Citroen C3 Aircross Dhoni Edition | సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ ఆవిష్కరణ.. స్టాండర్డ్ మోడల్ కంటే రూ.3 లక్షలు ఎక్కువ..!
Citroen C3 Aircross Dhoni Edition | ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఇండియా (Citroen India) తన సీ3 ఎయిర్‌క్రాస్ (C3 Aircross) స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Citroen C3 Aircross Dhoni Edition | ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఇండియా (Citroen India) తన సీ3 ఎయిర్‌క్రాస్ (C3 Aircross) స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. సిట్రోన్ ఇండియా ప్రచారకర్తగా లెజెండరీ భారత్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. ధోనీ ఎడిషన్ సీ3 ఎయిర్ క్రాస్ కార్లు కేవలం 100 యూనిట్లు మాత్రమే తయారు చేస్తోంది. సైడ్, కలర్ కోఆర్డినేటెడ్ సీట్ కవర్స్, కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్, ఇల్యూమినేటడ్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కామ్ తదితరాలపై ధోనీ డెకల్ కనిపిస్తుంది.
గ్లోవ్ బాక్స్‌లో స్పెషల్ `ధోనీ గుడీ`తో వస్తోంది ప్రతి ధోనీ ఎడిషన్ సీ3 ఎయిర్‌క్రాస్ కారు.100 కార్లలో ఒక లక్కీ కారుపై గ్లోవ్‌పై ధోనీ స్వయంగా చేసిన సంతకంతో 100 కార్లు వస్తుంది. రూ.11.82 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంటుందీ కారు. స్టాండర్డ్ సీ3 ఎయిర్ క్రాస్ కారు రూ.8.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 5-సీట్, సెవెన్ సీట్ వర్షన్లలోనూ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలోనూ లభిస్తాయి.
సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ స్టాండర్డ్ మోడల్ కారు 1.2 లీటర్ల త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 110 హెచ్‌పీ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ కారు ఎక్స్‌టీరియర్ గా వైట్ రూఫ్‌తో రూపుదిద్దుకున్న డ్యుయల్ టోన్‌తో వస్తోంది. సెలెక్టెడ్ కస్టమర్లకు ఎక్స్‌టీరియర్ బ్లూ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ మోడల్ కారు రేర్ డేర్ ధోనీ జెర్సీ నంబర్‌తో ఉంటుంది. ధోనీ జెర్సీ నంబర్ డినోట్ చేసిన రేర్ డోర్ పెద్దగా 7 నంబర్ ఉంటుంది.
ధోనీ ఎడిషన్ గ్రాఫిక్స్‌తో సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ వస్తుంది. స్టాండర్డ్ ట్రిమ్ కారుతో మరింత విభిన్నంగా ఫ్రంట్ డోర్స్ ఉంటాయి. స్పెషల్ గుడీస్‌తో స్పెషల్ ఎడిషన్ థీమ్డ్ కుషన్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, సీట్‌బెల్ట్ కుషన్స్, ఫ్రంట్ డాష్ కామ్ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది.