Citi India WFH | తల్లుల కోసం సిటీ బ్యాంక్ అరుదైన ఆఫర్.. కార్పొరేట్ చరిత్రలోనే ఫస్ట్ !
Citi India WFH | మాతృత్వం ఒక వరం. దాని కోసం ప్రతి మహిళా కల కంటుంది. కానీ, ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తేనే కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నాయి. గతంతో పోలిస్తే మహిళలకు కార్పొరేట్ సంస్థలు ప్రసవం, ప్రసవం తర్వాత సెలవులు ఇస్తున్నాయి.
Citi India WFH | మాతృత్వం ఒక వరం. దాని కోసం ప్రతి మహిళా కల కంటుంది. కానీ, ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తేనే కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నాయి. గతంతో పోలిస్తే మహిళలకు కార్పొరేట్ సంస్థలు ప్రసవం, ప్రసవం తర్వాత సెలవులు ఇస్తున్నాయి. ఆ బాటలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ `సిటీ బ్యాంక్ ఇండియా` కీలక నిర్ణయం తీసుకున్నది. తమ బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు మరింత వెసులుబాటు కలిగించాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు మహిళా ఉద్యోగులకు 26 వారాల మెటర్నిటీ సెలవు ఇస్తున్నది సిటీ బ్యాంక్ ఇండియా. తాజాగా వారికి 12 నెలల పాటు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కల్పిస్తున్నది. తల్లులైన వారికి, గర్భం దాల్చిన వారికి ఇది వర్తిస్తుంది. ఇక గర్భవతిగా ఉన్న మహిళ చివరి మూడు నెలలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కోసం విజ్ఞప్తి చేసే వెసులుబాటు కూడా సిటీబ్యాంక్ ఇండియా కల్పించింది. గర్భవతులు లేదా నూతన తల్లులకు 21 నెలల పాటు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించిన తొలి కార్పొరేట్ సంస్థగా సిటీ బ్యాంక్ ఇండియా నిలుస్తుంది.
`కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు కొత్తగా తల్లులైన వారు తమ కుటుంబం, కెరీర్ మధ్య బ్యాలెన్సింగ్ పాటించేందుకు చేయూతనివ్వాలని నిర్ణయించాం. ఇది మహిళలకు బెనిఫిట్ అవుతుంది. మెటర్నిటీ లింక్డ్ వర్క్ ఫ్రం హోం ఇన్సియేటివ్ అమలు చేస్తున్న తొలి సంస్థగా సిటీ బ్యాంక్ నిలుస్తుంది` అని సిటీ ఇండియా అండ్ సౌత్ ఆసియా హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ తెలిపారు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగానూ గర్భవతులు, కొత్తగా తల్లులైన వారికి ఈ వర్క్ ఫ్రం హోం పాలసీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సిటీ బ్యాంక్ ఇటీవలే భారత్ కన్జూమర్ బిజినెస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వచ్చే రెండేండ్లలో వివిధ దేశాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 5000 మంది ప్రతిభావంతులను నియమించుకోవాలని నిర్ణయించింది.
భారత్‌లో సిటీ బ్యాంకులో 30 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 38 శాతం మహిళలు. `భారీ సంఖ్యలో ఉన్న మా మహిళా ఉద్యోగులు వారి పిల్లల బాగోగులు చూసుకోవాల్సి ఉంది. మా ఉద్యోగుల్లో మహిళలకు వర్క్ ఫ్రం హోం పాలసీ అత్యంత ఆకర్షణీయం, కానున్నది` అని ఆదిత్య మిట్టల్ తెలిపారు. మహిళా ఉద్యోగుల ప్రతిభను సద్వినియోగం చేసుకోవడంతోపాటు వారి కెరీర్ ఆకాంక్షలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఆదిత్య మిట్టల్. వచ్చే ఐదేండ్లలో మొత్తం బ్యాంకులో 50 శాతం మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని సంకల్పించింది.