Maruti Brezza | ఎస్‌యూవీల్లో మ‌ళ్లీ మారుతి టాప్‌.. ఆ మూడు మోడ‌ల్ కార్లే కార‌ణ‌మా?!

Maruti Brezza | గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ఎస్‌యూవీ కార్ల వైపు మొగ్గుతున్నారు. కార్ల త‌యారీ సంస్థ‌లు సైతం త‌మ క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌లు, అభిరుచుల‌కు అనుగుణంగా స‌రికొత్త ఫీచ‌ర్లు, ఆప్ష‌న్ల‌తో అప్‌డేటెడ్ ఎస్‌యూవీ కార్లు ఆవిష్క‌రిస్తున్నాయి.

Advertisement
Update:2023-09-13 13:40 IST

Maruti Brezza | ఎస్‌యూవీల్లో మ‌ళ్లీ మారుతి టాప్‌.. ఆ మూడు మోడ‌ల్ కార్లే కార‌ణ‌మా?!

Maruti Brezza | గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ఎస్‌యూవీ కార్ల వైపు మొగ్గుతున్నారు. కార్ల త‌యారీ సంస్థ‌లు సైతం త‌మ క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌లు, అభిరుచుల‌కు అనుగుణంగా స‌రికొత్త ఫీచ‌ర్లు, ఆప్ష‌న్ల‌తో అప్‌డేటెడ్ ఎస్‌యూవీ కార్లు ఆవిష్క‌రిస్తున్నాయి. ఆ క్ర‌మంలో మారుతి సుజుకి మొద‌టి వ‌రుస‌లోనే నిలిచింది. వ‌రుస‌గా రెండో నెల (ఆగ‌స్టు) అత్య‌ధిక ఎస్‌యూవీ కార్లు త‌యారు చేసిన సంస్థ‌గా మారుతి చోటు ద‌క్కించుకున్న‌ది. మారుతి సుజుకి త‌ర్వాతీ స్థానంలో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కొన‌సాగుతున్న‌ది.

గ‌త నెల‌లో మొత్తం 3,60,897 కార్లు అమ్ముడు కాగా, వాటిల్లో ఎస్‌యూవీల వాటా 48.6 శాతం. దేశీయ ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీలోనే ఇది ఆల్‌టైం రికార్డు. మారుతి సుజుకి 41,658 యూనిట్ల ఎస్‌యూవీ కార్లు, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా 37,223 కార్లు విక్ర‌యించింది. జూలైలోనూ మారుతి సుజుకి 42,620 ఎస్‌యూవీ కార్లు, మ‌హీంద్రా 36,124 యూనిట్లు విక్ర‌యించాయి.

మారుతి సుజుకి ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో ఫ్రాంక్స్‌, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్ విటారా మోడ‌ల్స్ కీల‌క భూమిక వ‌హిస్తుంటే.. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రాకు చెందిన స్కార్పియో (ఎన్ అండ్ క్లాసిక్‌), బొలెరో (నియో వ‌ర్ష‌న్‌తోపాటు), ఎక్స్‌యూవీ700, థార్‌, ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 400 మోడ‌ల్ కార్లు దూసుకెళ్తున్నాయి.

మొత్తం ఎస్‌యూవీ కార్ల‌లో మారుతి బ్రెజా 14,572 యూనిట్లు అమ్ముడు కాగా, ఫ్రాంక్స్ 12,164, గ్రాండ్ విటారా 11,818, జిమ్నీ 3104 యూనిట్లు విక్ర‌యించింది. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రాలో స్కార్పియో (ఎన్ & క్లాసిక్‌) బెస్ట్ సెల్లింగ్ యూనిట్‌గా నిలిచింది. స్కార్పియో (ఎన్ అండ్ క్లాసిక్‌) 9,092 యూనిట్లు, ఎక్స్‌యూవీ700 6,512, థార్ 5941 కార్లు విక్ర‌యించింది.

మారుతి బ్రెజా 14,572 కార్లు అమ్ముడైనా గ‌తేడాదితో పోలిస్తే నాలుగు శాతం త‌క్కువ‌. సుదీర్ఘ‌కాలం పాటు ఎస్‌యూవీల్లో రారాజుగా నిలిచిన హ్యుండాయ్ క్రెటాను ప‌క్క‌కు త‌ప్పించింది మారుతి బ్రెజా. ఇక టాటా పంచ్ 14, 523 యూనిట్ల విక్ర‌యంతో 20.96 శాతం వృద్ధి సాధించింది. టాటా పంచ్‌కు హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతున్న‌ది. హ్యుండాయ్ క్రెటా సైతం 9.98 శాతం గ్రోత్ న‌మోదు చేసింది. గ‌త నెల‌లో 13,832 హ్యుండాయ్ క్రెటా కార్లు అమ్ముడ‌య్యాయి. మార్కెట్లో త‌న స్థానాన్ని కాపాడుకునేందుకు హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ త్వ‌ర‌లో మార్కెట్లోకి తేనున్న‌ది.

Tags:    
Advertisement

Similar News