17 వేల మంది ఉద్యోగులకు బోయింగ్ గుడ్ బై!
ఉద్యోగం నుంచి తొలగించే యత్నాల్లో దిగ్గజ ఏరో స్పేస్ కంపెనీ
దిగ్గజ ఏరో స్పేస్ కంపెనీ బోయింగ్ 17 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి సిద్ధమైంది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో కనీసం పది శాతం మందికి త్వరలోనే గుడ్ బై చెప్పబోతుంది. వారిలో ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్స్ ఇచ్చేశారని తెలుస్తోంది. పింక్ స్లిప్పులు ఇచ్చిన వారికి రెండు నెలల పాటు నోటీస్ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇటీవల సియాటెల్ లో బోయింగ్ ఉద్యోగులు నెల రోజుల పాటు సమ్మె చేశారు. 30 వేల మందికి పైగా సమ్మెలో పాల్గొనడంతో 737 మ్యాక్స్, 767, 777 జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఫలితంగా కంపెనీ భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడంతో వాటి నుంచి బయట పడిందేందుకు లే ఆఫ్స్ ను సంస్థ అవకాశంగా ఎంచుకుంది. కేవలం కింది స్థాయి సిబ్బందిని మాత్రమే కాదు మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు పింక్ స్లిప్పులు ఇస్తున్నారని తెలిసింది.