గూగుల్ `బార్డ్‌`.. బ్లండ‌ర్ మిస్టేక్‌..! - ఒక్క‌రోజులోనే 100 బిలియ‌న్ డాల‌ర్లు ఆవిరి..!

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `బార్డ్‌`కు సంబంధించిన ఒక అడ్వ‌ర్టైజ్‌మెంట్‌లో భారీ త‌ప్పిదం చోటుచేసుకుంది. దీంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫా బెట్ షేర్ ధ‌ర బుధ‌వారం భారీ ఒడిదుడుల‌కు గురైంది.

Advertisement
Update:2023-02-09 20:45 IST

మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ రంగంలోకి తెచ్చిన `బార్డ్‌` చేసిన పొర‌పాటు వ‌ల్ల గూగుల్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. దానివ‌ల్ల భారీ న‌ష్టాన్ని చ‌విచూసింది. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `బార్డ్‌`కు సంబంధించిన ఒక అడ్వ‌ర్టైజ్‌మెంట్‌లో భారీ త‌ప్పిదం చోటుచేసుకుంది. దీంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫా బెట్ షేర్ ధ‌ర బుధ‌వారం భారీ ఒడిదుడుల‌కు గురైంది. అమెరికా ఎక్స్‌ఛేంజీల‌లో ఆల్ఫాబెట్ షేర్లు 8 శాతం కుప్ప‌కూలాయి. దీంతో ఒక్క‌రోజులోనే ఏకంగా 100 బిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ మేర మార్కెట్ విలువ‌ను కోల్పోయింది.

`బార్డ్` యాప్‌లోని త‌ప్పిదాన్ని తొలుత రాయిట‌ర్స్ గుర్తించింది. సౌర వ్య‌వ‌స్థ వెలుప‌లి గ్ర‌హాల చిత్రాల‌ను తొలిసారిగా ఏ శాటిలైట్ తీసింద‌న్న ప్ర‌శ్న‌కు `బార్డ్‌` స‌రైన స‌మాధానం ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైంది. `జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్` అని స‌మాధానం చెప్పింది. కానీ, నాసా ధ్రువీక‌రించిన‌ట్టుగా 2004లో యూరోపియ‌న్ స‌ద‌ర‌న్ అబ్జ‌ర్వేట‌రీ వెరీ లార్జ్ టెలిస్కోప్ ద్వారా ఎక్సోప్లానెట్‌ల తొలి చిత్రాల‌ను తీసింది. `బార్డ్‌`కు సంబంధించి గూగుల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన GIF వీడియోను `లాంచ్ ప్యాడ్‌`గా అభివ‌ర్ణించింది. ఈ షార్ట్ వీడియోలోనే ఈ పొర‌పాటు దొర్లింది.

గూగుల్ గ‌త కొన్ని వారాలుగా సెర్చ్‌ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ స‌మ‌యంలో హ‌డావుడిగా ఇచ్చిన డెమో స‌మ‌యంలో తప్పు స‌మాధానాన్ని పోస్ట్ చేయ‌డం గంద‌ర‌గోళానికి దారితీసింద‌ని సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ విశ్లేష‌కుడు గిల్ లూరియా అన్నారు.

Tags:    
Advertisement

Similar News