ఆర్థికంగా ఎదగాలంటే సేవింగ్ ప్లాన్ ఇలా ఉండాలి!

సేవింగ్స్ చేయాలనుకుంటే దానికి టైంతో పనిలేదు. వెంటనే మొదలు పెట్టాలి. ‘టైం ఈజ్ మనీ’ అన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి.

Advertisement
Update:2024-08-02 15:52 IST

ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న చాలామంది డబ్బుని మేనేజ్ చేయడంలో ఇబ్బందిపడుతుంటారు. సేవింగ్స్‌కు బదులు ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారు. దీంతో ఎన్నేళ్లు గడిచినా ఆర్థికంగా ఎదగలేకపోతారు. అందుకే సేవింగ్స్ విషయంలో సరైన ప్లానింగ్ ఉండాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే.

సేవింగ్స్ చేయాలనుకుంటే దానికి టైంతో పనిలేదు. వెంటనే మొదలు పెట్టాలి. ‘టైం ఈజ్ మనీ’ అన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. అలా వెంటనే మొదలుపెట్టినప్పుడే అది అలవాటుగా మారుతుంది. ఈ రోజుల్లో వంద నోటు మారిస్తే కాసేపటికి రూపాయి కూడా చిల్లర మిగలట్లేదు. దీనికి కారణం ఖర్చుపై కంట్రోల్ లేకపోవడమే. పొదుపు అంటే ఖర్చుపై అదుపు. ఖర్చుల్ని అదుపులో ఉంచుకున్నప్పుడే పొదుపు సాధ్యం. దీనికై కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం.

సంపాదనలో కనీసం 10 నుంచి 30 శాతం ఆదా చేసుకుంటేనే ఫ్యూచర్‌‌లో ఫైనాన్షియల్ ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇలా సేవ్ చేయడం వల్ల వయసుతో పాటే.. ఆస్తి కూడా పెరుగుతుంది. పొదుపు ఎలా చేయాలి అన్న విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. అయితే వాటికోసం ఎన్నో మార్గాలున్నాయి. వాటన్నింటిలో మ్యూచువల్‌ ఫండ్స్‌, బ్యాంకుల్లో రికరింగ్‌ డిపాజిట్స్ చేయడం ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్స్. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ఫ్యూచర్‌‌లో ఎక్కువ లాభముంటుందని, డబ్బును ఒకచోట స్థిరంగా ఉంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అవసరానికి అప్పు చేయడం అలవాటు చాలామందికి . కానీ ఇప్పుడు చేసే అప్పు ఫ్యూచర్‌‌లో తిప్పలు తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వడ్డీలకు అస్సలు అప్పులు చేయకూడదు. అప్పుకు ఎంత దూరంగా ఉంటే ఫైనాన్షియల్‌గా అంత సేఫ్‌గా ఉన్నట్టు లెక్క.

ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా ఖర్చు పెట్టేది షాపింగ్‌కే. ఆఫర్ల పేరుతో డిస్కౌంట్ సేల్స్ పెడితే అందరూ అట్రాక్ట్ అయ్యి షాపింగ్ చేస్తుంటారు. అయితే ఇదే విషయంలో మిలియనీర్స్ జాగ్రత్తగా ఉంటారని మీకు తెలుసా? మిలియనీర్స్ షాపింగ్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టరు. మినిమలిస్టిక్ పద్దతిలో అవసరానికి తగ్గ వస్తువులు వాడుతూ, ఖర్చులను కంట్రోల్ చేస్తారు. ఇదే వారికి మనకు ఉన్న తేడా.

పొదుపుని పెంచాలంటే ఒక సిస్టమాటిక్ బడ్జెట్‌ వేసుకోవడం చాలా అవసరం. ఆదాయాన్ని, ఖర్చులను బట్టి ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్ ఏంటో నిర్ణయించుకుని, ఒక సిస్టమాటిక్ బడ్జెట్ వేసుకోవాలి. పొదుపు చేసే ప్రతీ రూపాయి ఎక్స్‌ట్రా ఇన్‌కం కింద లెక్క వేసుకోవాలి. ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలంటే.. కెరీర్‌లో వస్తున్న మార్పులు గమనించాలి. కొన్నిసార్లు శాలరీలో హైక్‌ రావచ్చు. మరికొన్నిసార్లు ఆదాయం తగ్గిపోవచ్చు. వాటికి తగ్గట్టు ప్లాన్ ఉండాలి. ఆదాయం పెరిగితే దానిని మరింత పొదుపు చేయాలి. ఒకవేళ తగ్గితే ఖర్చులు తగ్గించుకోవాలి తప్ప పొదుపులో తేడా రాకుండా చూసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News