ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు రూ.10 లక్షల్లో లభించే బెస్ట్ కార్లివే..!
రోజురోజుకు టెక్నాలజీ కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది. ఆటోమొబైల్స్‌లో కారు గానీ, మోటారు సైకిల్ గానీ లేదా స్కూటర్ గానీ కొనుగోలు చేస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఇప్పుడు తప్పనిసరి.
రోజురోజుకు టెక్నాలజీ కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది. ఆటోమొబైల్స్‌లో కారు గానీ, మోటారు సైకిల్ గానీ లేదా స్కూటర్ గానీ కొనుగోలు చేస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఇప్పుడు తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న అత్యాధునిక కార్లలో వచ్చే కీలక ఫీచర్లలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఒకటి. హెడ్ ల్యాంప్ వల్ల బోల్డు ప్రయోజనాలు ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో విశాలంగా విరజిమ్మే వెలుతురుతో చీకట్లో కారు డ్రైవర్‌కు మెరుగైన విజబిలిటీ అందిస్తుంది.. మెరుగైన రోడ్ సేఫ్టీ లభిస్తుంది. ఎల్ఈడీ లైట్లు కార్ల స్టయిల్‌ను విస్తృత పరుస్తాయి.
అంతే కాదు హాలోజెన్ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీ లైట్లతో తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. భారత్‌లోని హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ వినియోగిస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. ఫ్రెష్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నూతన-అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నాయి. రూ.10 లక్షల్లోపు ధర గల కార్లలో వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఎల్ఈడీ హెడ్ లైట్స్ వినియోగిస్తున్నారు. రూ. 10 లక్షల్లోపు ధరతోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ గల కార్లివే..!
మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలా
దేశీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి భారత్‌లో అత్యంత ప్రజాదరణ గల కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. వివిధ సెగ్మెంట్ కార్లలో కంటే బెస్ట్ సెల్లింగ్ మోడల్ కార్లలో ఇదొకటి. మారుతి సుజుకి ఆదాయం కుమ్మరిస్తున్న హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్. మారుతి సుజుకి స్విఫ్ట్ జడ్ఎక్స్ఐ + ట్రిమ్ వేరియంట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లతో వస్తుంది. దీని ధర రూ.8.34 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ హ్యుండాయ్ ఐ20
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ ఐ20.. భారత్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు ఇదే. విస్తృత శ్రేణి ఫీచర్లతో వస్తున్న హ్యుండాయ్ ఐ20 ఆస్టా వేరియంట్‌లో మాత్రమే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కారు ధర రూ.9.28 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇలా మారుతి సుజుకి బాలెనో
మారుతి సుజుకి విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో. కర్వీ డిజైన్‌తో కళ్లను ఇట్టే ఆకట్టుకునే ఫీచర్లు ఈ కారు సొంతం. వివిధ ఫీచర్లతోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ గల జెటా ట్రిమ్ కారు రూ.8.38 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మైక్రో ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇగ్నీస్
మారుతి సుజుకిలో మైక్రో ఎస్‌యూవీ-థీమ్డ్ కారు ఇగ్నిస్. దేశంలో అండర్ రేటెడ్ కారు ఇదొక్కటే. కార్ల కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించని మోడల్ కారు ఇదే. అయినా ప్రాక్టికల్లీ, చాలా ఫీచర్లతో అందుబాటులో ఉన్న కారు మారుతి ఇగ్నిస్ మాత్రమే. ఇగ్నిస్ టాప్ ఎండ్ అల్ఫా ట్రిమ్ మోడల్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఫీచర్ ఉంది. దీని ధర రూ.7.61 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇలా సెడాన్ సెగ్మెంట్ హోండా అమేజ్
జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉన్న కారు అమేజ్. స్టయిల్‌తోపాటు సెడాన్‌లతో గల కంఫర్ట్‌ను బ్రేక్ చేస్తున్న.. హోండా అమేజ్ పాపులారిటీ కల మోడల్‌గా నిలిచింది. అమేజ్ టాప్ ఎండ్ వీఎక్స్ ట్రిమ్ మోడల్ కారు ధర రూ.8.88 లక్షలు (ఎక్స్ షోరూమ్).