సీఎన్‌జీ బైక్ తీసుకురానున్న బ‌జాజ్

కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్ (సీఎన్‌జీ) ఇప్ప‌టివ‌ర‌కే త్రీ వీల్స్‌, ఫోర్‌ వీలర్స్‌కు మాత్ర‌మే ప‌రిమితం. ఇప్ప‌డు ఇక ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో కూడా సీఎన్‌జీ రాబోతోంది.

Advertisement
Update:2023-10-22 10:20 IST

సీఎన్‌జీ బైక్ తీసుకురానున్న బ‌జాజ్

కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్ (సీఎన్‌జీ) ఇప్ప‌టివ‌ర‌కే త్రీ వీల్స్‌, ఫోర్‌ వీలర్స్‌కు మాత్ర‌మే ప‌రిమితం. ఇప్ప‌డు ఇక ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో కూడా సీఎన్‌జీ రాబోతోంది. త్వరలోనే ఇండియ‌న్ మార్కెట్లోకి సీఎన్‌జీ బైక్‌లు తీసుకొస్తామ‌ని వాహ‌న రంగ దిగ్గ‌జం బ‌జాజ్ ప్ర‌క‌టించింది. పెట్రోల్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఇప్ప‌టికే బ్యాట‌రీ, ఈవీలు రాగా ఇప్పుడుతాము తెచ్చే సీఎన్‌జీ టూ వీల‌ర్ గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని బ‌జాజ్ భావిస్తోంది.

బ్రుజెర్‌ ఈ101 కోడ్‌ నేమ్‌తో వ‌స్తోంది.

పెట్రోల్‌ ధరలు కొండ‌లా పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. పెద్ద వాహనాల్లో అయితే సీఎన్‌జీ వాహనాల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్‌తో పోల్చితే ఖ‌ర్చు బాగా తక్కువ ఉండడంతో ఎక్కువ మంది మంది సీఎన్‌జీని ఇష్టపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో భారత మార్కెట్లోకి సీఎన్‌జీ బైక్‌లను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతోంది బబాజ్‌. బ్రుజెర్‌ ఈ101 కోడ్‌ నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్‌జీ బైక్‌ను ఔరంగాబాద్‌లోని ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది.

వ‌చ్చే ఏడాది లాంచింగ్

వచ్చే ఏడాది అంటే 2024లో ఈ బైక్‌ను బ‌జాజ్ అధికారికంగా మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. దిగువ స్థాయి 110 సీసీ సెగ్మెంట్‌లో ప్లాటినా పేరుతో ఇప్ప‌టికే క్లిక్ అయిన టూవీల‌ర్‌ను సీఎన్‌జీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేసి తీసుకురానున్నారని తెలుస్తోంది. బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే దిశలో భాగంగా సీఎన్‌జీ బైక్ తీసుకురావాలని బజాన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.ఏడాదికి ల‌క్షా ఇర‌వై వేల బైకులు త‌యారు చేస్తామ‌ని, డిమాండ్‌ను బ‌ట్టి దాన్ని 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచుతామ‌ని చెప్పారు.

బ్యాట‌రీ, ఈవీల‌తో పోల్చితే టైమ్ సేవింగ్‌

పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్ప‌టికే బ్యాట‌రీ, ఈవీ టూవీల‌ర్స్ మార్కెట్‌లోకి వ‌చ్చాయి. అయితే వాటి ఛార్జింగ్ కి టైమ్ ఎక్కువ ప‌డుతోంది. అదే సీఎన్‌జీ అయితే బంకులోకి వెళ్లి పెట్రోలు నింపుకున్న‌ట్లు నింపుకోవ‌డ‌మే. కాబ‌ట్టి టైమ్ బాగా క‌లిసొస్తుంది. అయితే ఈవీలు ల‌క్ష‌న్నర వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతుండ‌టంతో వాటివైపు సామాన్యులు వెళ్ల‌డానికి జంకుతున్నారు.ఈ ప‌రిస్థితుల్లో సీఎన్‌జీ బైకు ధ‌ర ల‌క్ష‌లోపు ఉంటే వాటికి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌తుంద‌ని వాహ‌న రంగ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News