Ather Rizta | మార్కెట్‌లోకి ఎథేర్ ఫ్యామిలీ ఈవీ స్కూట‌ర్ రిజ్టా..ధ‌ర‌ రూ.1.09 ల‌క్ష‌ల నుంచి షురూ..!

Ather Rizzta | బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ ఎథేర్ ఎన‌ర్జీ (Ather Energy).. దేశీయ మార్కెట్లోకి ఫ్యామిలీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎథేర్ రిజ్టా (Ather Rizta) ప్ర‌వేశ పెట్టింది.

Advertisement
Update:2024-04-07 11:03 IST

Ather Rizzta | బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ ఎథేర్ ఎన‌ర్జీ (Ather Energy).. దేశీయ మార్కెట్లోకి ఫ్యామిలీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎథేర్ రిజ్టా (Ather Rizta) ప్ర‌వేశ పెట్టింది. 450 సిరీస్ స్కూట‌ర్ల త‌ర్వాత ఎథేర్ కొత్త‌గా డిజైన్ చేసిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎథేర్ రిజ్టా (Ather Rizta) .. సింగిల్ చార్జింగ్‌తో 160 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఎథేర్ రిజ్టా (Ather Rizta) పొడ‌వైన సీట్‌, అత్య‌ధిక బూట్ స్పేస్ క‌లిగి ఉంటుంది. కొత్త‌గా వాయిస్ క‌మాండ్స్ వ‌ర్క్‌తో న్యూ హ‌లో హెల్మెట్ ప్ర‌వేశ పెట్టింది.

ఎథేర్ రిజ్టా (Ather Rizta) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ రెండు వేరియంట్లు, మూడు బ్యాట‌రీ ప్యాక్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. రిజ్టా ఎస్ (2.9 కిలోవాట్ల బ్యాట‌రీ), రిజ్టా జ‌డ్ (2.9 కిలోవాట్ల బ్యాట‌రీ), రిజ్టా జ‌డ్ (3.7 కిలోవాట్ల బ్యాట‌రీ) ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఎథేర్ రిజ్టా (Ather Rizta) ధ‌ర రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభ‌మైంది. టాప్ వేరియంట్ రూ.1.45 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది.

ఎథేర్ రిజ్టా ఎస్ (Ather Rizzta S) ఈవీ స్కూట‌ర్ మూడు మోనో టోన్ క‌ల‌ర్స్ ఆప్ష‌న్ల‌లో ల‌భ్యం అవుతుంది. ఇక రిజ్టా జ‌డ్ (Rizzta Z) మూడు మోనోటోన్ క‌ల‌ర్స్‌, నాలుగు డ్యుయ‌ల్ టోన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తుంది. ఇప్ప‌టికే ఎథేర్ రిజ్టా స్కూట‌ర్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆస‌క్తి గ‌ల క‌స్ట‌మ‌ర్లు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.999 చెల్లించి ఈవీ ఎథేర్ రిజ్టా స్కూట‌ర్ బుక్ చేసుకోవ్చు. జూలై 24 నుంచి స్కూట‌ర్ల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని ఎథేర్ ప్ర‌క‌టించింది. ఓలా ఎస్‌1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్‌, బ‌జాజ్ చేత‌క్ ఈవీ స్కూట‌ర్ల‌తో ఎథేర్ రిజ్టా స్కూట‌ర్ పోటీనిస్తుంది.

ఎథేర్ రిజ్టా (Ather Rizta) స్కూట‌ర్‌పై ఐదేండ్ల ఆప్ష‌న‌ల్ వారంటీతోపాటు ఎథేర్ బ్యాట‌రీ ప్రొటెక్ట్‌ కింద ఐదేండ్లు లేదా 60 కి.మీ వ‌ర‌కూ వారంటీ ఉంటుంది. బ్యాట‌రీ దెబ్బ‌తిన్నా, ఐదేండ్ల వ‌ర‌కూ 70 శాతం హెల్తీగా ఉన్నా వారంటీ వ‌ర్తిస్తుంది.

ఎథేర్ రిజ్టా (Ather Rizta) స్కూట‌ర్ ఎల్ఈడీ లైట్ సెట‌ప్ విత్ ఎల్ఈడీ ఇండికేట‌ర్లు, మెరుగైన విజిబిలిటీ కోసం ఆప్రాన్‌లోని లైట్ కుడి, ఎడ‌మ‌ల‌కు తిరుగుతూ ఉంటుంది. జాయ్ స్టిక్ వంటి బ‌ట‌న్‌తో లెఫ్ట్‌, రైట్‌, అప్‌, డౌన్ చేయొచ్చు. నేవిగేష‌న్‌తో ప‌లు స్మార్ట్ క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు క‌లిగి ఉంటాయి. స్కూట‌ర్ రేర్‌లో గ్యాబ్‌రైల్‌పై స్మాల్ బ్యాక్ రెస్ట్‌, కింద ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. కంఫ‌ర్ట‌బుల్ రైడింగ్ కోసం ఫ్రంట్‌లో డ్యుయ‌ల్ టెలిస్కోపిక్ స‌స్పెన్ష‌న్‌, రేర్‌లో మోనోషాక్ అబ్జార్బ‌ర్ ఉంటాయి. ఫ్రంట్‌వీల్‌లో డిస్క్ బ్రేక్‌, రేర్‌లో డ్ర‌మ్ బ్రేక్ ఉంటాయి. జిప్‌, స్మార్ట్ ఎకో రైడింగ్ మోడ్‌ల్లో ల‌భిస్తుంది. మ్యాజిక్ ట్విస్ట్, ఆటో హోల్డ్‌, రివ‌ర్స్ మోడ్‌లో కూడా ఉంట‌ది. ఏథేర్ 450 సిరీస్ స్కూట‌ర్ల‌లో మాదిరిగా ఫాల్స్ సేఫ్‌, ఎమ‌ర్జెన్సీ స్టాప్ సిగ్న‌ల్ (ఈఎస్ఎస్‌), షేర్ లైవ్ లొకేష‌న్‌, థెఫ్ట్‌, టౌ డిటెక్ట్‌, ఫైండ్ మై స్కూట‌ర్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News