Kia Seltos: మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటాపోటీ.. ఐదేండ్ల‌లోనే ఐదు ల‌క్ష‌ల యూనిట్ల కార్లు సేల్స్..!

హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder), హోండా ఎలివేట్ (Honda Elevate), ఫోక్స్ వ్యాగ‌న్ టైగూన్ (Volkswagen Taigun), స్కోడా స్లావియా (Skoda Slavia), ఎంజీ ఆస్ట‌ర్ (MG Astor) కార్లకు క‌స్ట‌మ‌ర్ల నుంచి ఫుల్ గిరాకీ ఉంది.

Advertisement
Update: 2024-08-17 05:57 GMT

Kia Seltos: ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా ఉండే ఎస్‌యూవీల‌పై మోజు పారేసుకుంటున్నారు. ఎస్‌యూవీల్లో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో భారీగా గిరాకీ ఉంది. హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder), హోండా ఎలివేట్ (Honda Elevate), ఫోక్స్ వ్యాగ‌న్ టైగూన్ (Volkswagen Taigun), స్కోడా స్లావియా (Skoda Slavia), ఎంజీ ఆస్ట‌ర్ (MG Astor) కార్లకు క‌స్ట‌మ‌ర్ల నుంచి ఫుల్ గిరాకీ ఉంది. వీటితోపాటు మిడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో త‌క్కువ కాలంలో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. కేవ‌లం ఐదేండ్ల గ‌డువులోపే దాదాపు ఐదు ల‌క్ష‌ల యూనిట్లు అమ్ముడ‌య్యాయి. అది పాపుల‌ర్ కియా సెల్టోస్ (Kia Seltos).

భార‌త్ మార్కెట్లో 2019 ఆగ‌స్టులో సెల్టోస్‌తో కియా ఇండియా (Kia India) ఎంట‌రయింది. దేశీయ మార్కెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ కియా ఇండియా 10 ల‌క్ష‌ల కార్లు విక్ర‌యించింది. వాటిల్లో కియా సెల్టోస్ (Kia Seltos) వాటా 48 శాతానికి పై మాటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ 4.80 ల‌క్ష‌ల‌కు పైగా కియా సెల్టోస్ కార్లు అమ్ముడ‌య్యాయి. మొత్తం కియా ఇండియా విక్ర‌యాలు ప‌ది ల‌క్ష‌ల యూనిట్ల‌లో సెల్టోస్ వాటా 48 శాతానికి పై చిలుకే. గ‌తేడాది జూలైలో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వ‌ర్ష‌న్ ఆవిష్క‌రించింది కియా ఇండియా. కియా సెల్టోస్ పేస్‌లిఫ్ట్ ధ‌ర రూ.10.90 ల‌క్ష‌ల నుంచి రూ.20.37 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. దేశీయ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వాల్యూ ఫ‌ర్ మ‌నీ ప్యాకేజీ బెస్ట్‌గా నిలిచింది కియా సెల్టోస్ (Kia Seltos). డిమాండ్ రోజురోజుకు వృద్ధికి పెరిగిపోవ‌డం వ‌ల్లే కియా సెల్టోస్ కార్లు అమ్ముడ‌య్యాయి. ప‌లు ఫీచ‌ర్లు, మ‌ల్టీపుల్ ప‌వ‌ర్ ట్రైన్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది.

కియా సెల్టోస్ (Kia Seltos) కారు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ (LED headlamps), ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs), ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్ (LED fog lamps), సీక్వెన్షియ‌ల్ ఎల్ఈడీ ట‌ర్న్ ఇండికేట‌ర్లు (Sequential LED turn indicators), ఎల్ఈడీ క‌నెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ (LED connected taillamps), 18- అంగుళాల క్రిస్ట‌ల్ క‌ట్ అల్లాయ్ వీల్స్ (18-inch crystal cut alloy wheels), ఫ్రంట్ పార్కింగ్ సెన్స‌ర్లు (front parking sensors), డ్య‌య‌ల్ పాన్ ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్ (dual-pane panoramic sunroof), డ్యుయ‌ల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (dual-zone fully automatic climate control), 10.25 అంగుళాల ఫుల్లీ డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్ (10.25-inch fully-digital instrument cluster), 10.25 అంగుళాల హెచ్‌డీ ట‌చ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ (10.25-inch HD touchscreen infotainment system), 8-అంగుళాల హెచ్‌యూడీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, ఎయిట్‌వే ప‌వ‌ర్ డ్రైవ‌ర్స్ సీట్‌, బోస్ ప్రీమియం సౌండ్ సిస్ట‌మ్ విత్ ఎయిట్ స్పీక‌ర్స్‌, ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్‌, 360-డిగ్రీ కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిట‌ర్‌, లెవెల్ 2 అడాస్ సిస్ట‌మ్ వంటి ఫీచ‌ర్లు గ‌ల కారు కియా సెల్టోస్‌.

కియా సెల్టోస్ (Kia Seltos) మూడు ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది. స్మార్ట్‌స్ట్రీమ్ 1.5 లీట‌ర్ల ట‌ర్బో జీడీఐ పెట్రోల్- -160పీఎస్ విద్యుత్‌/253ఎన్ఎం టార్క్‌. (Smartstream 1.5-litre Turbo-GDi petrol), స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీట‌ర్ల నేచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ -115పీఎస్ విద్యుత్‌/144ఎన్ఎం టార్క్‌ (Smartstream 1.5-litre NA petrol), స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీట‌ర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ -116 పీఎస్ విద్యుత్‌, 20 ఎన్ఎం టార్క్‌ (Smartstream 1.5-litre CRDi VGT diesel) ఆప్ష‌న్ల‌లో వ‌స్తోంది. ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటీ, 7-స్పీడ్ డీసీటీ, నేచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీ, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ వ‌ర్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

Tags:    
Advertisement

Similar News