Hyundai Creta facelift | 16న భార‌త్ మార్కెట్లోకి హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌.. ఆ టాప్ ఏడు కంపెనీల కార్ల‌తో బ‌స్తీమే స‌వాలే..!

Hyundai Creta facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త‌న ఎస్‌యూవీ మోడ‌ల్ కారు హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెల 16న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

Advertisement
Update:2024-01-04 09:59 IST

Hyundai Creta facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త‌న ఎస్‌యూవీ మోడ‌ల్ కారు హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెల 16న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే రూ.25 వేల టోకెన్ సొమ్ము చెల్లింపుతో క‌స్ట‌మ‌ర్ల నుంచి బుకింగ్స్ స్వీక‌రిస్తున్న‌ది. క‌స్ట‌మ‌ర్ల అంచ‌నాల‌కు అనుగుణంగానే క్రెటా ఫేస్‌లిఫ్ట్‌.. ఇంటీరియ‌ర్‌గా, ఎక్స్‌టీరియ‌ర్‌గా ప‌లు ప్ర‌ధాన మార్పులు చేసింది. డాష్‌బోర్డ్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు తెస్తున్న‌ది. 10.25 అంగుళాల స్క్రీన్‌, న్యూ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌పై ట‌చ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. అల్కాజ‌ర్ టెక్నాల‌జీ నుంచి స్వీక‌రించిన డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్ జ‌త చేసింది.

ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్‌, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌, ఎంజీ ఆస్ట‌ర్‌, టాటా హారియ‌ర్‌, స్కోడా కుషాక్‌, ఫోక్స్ వ్యాగ‌న్ టైగూన్ మోడ‌ల్ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

సెంట‌ర్ క‌న్సోల్‌ను రీడిజైన్ చేశారు. సెంట‌ర్‌లో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌, ట‌చ్ కంట్రోల్ ప్యానెల్‌పై న్యూ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. స్టోరేజీ స్పేసెస్‌కు అనుగుణంగా గేర్ లివ‌ర్ డిజైన్ చేశారు. ఇక కారులో క్లైమేట్ కంట్రోల్ సిస్ట‌మ్‌, ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ మ‌ధ్య‌ స్లిమ్ ఏసీ వెంట్స్ ఏర్పాటు చేస్తారు. బ్యాక్‌లిట్ స్విచెస్‌తో హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వ‌స్తుంది. ఫోర్‌-స్పోక్ స్టీరింగ్ వీల్‌, సెంట‌ర్ ఆర్మ్‌రెస్ట్‌, క్యాబిన్ కొర‌కు డ్యుయ‌ల్ టోన్ థీమ్‌, యాంబియెంట్ లైటింగ్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి.

హ్యుండాయ్ క్రెటా-2024 ఫేస్‌లిఫ్ట్ కారు ఏడు వేరియంట్ల‌లో ల‌భిస్తుంద‌ని ధృవీక‌రించింది. ఈ, ఈఎక్స్‌, ఎస్‌, ఎస్‌(ఓ), ఎస్ఎక్స్‌, ఎస్ఎక్స్ టెక్‌, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ల‌తోపాటు ఆరు మోనో టోన్‌, ఒక డ్యుయ‌ల్ టోన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుందీ కారు. ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారు మూడు ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులోకి వ‌స్తోంది. 1.5 లీట‌ర్ల ఎంపీఐ పెట్రోల్‌, 1.5 లీట‌ర్ల యూ2 సీఆర్డీఐ డీజిల్‌, 1.5 లీట‌ర్ల క‌ప్పా ట‌ర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో ల‌భిస్తుంది. గ‌త మూడేండ్లుగా భార‌త్ మార్కెట్లో అమ్ముడ‌వుతున్న బెస్ట్ ఎస్‌యూవీ కార్ల‌లో ఒక‌టిగా హ్యుండాయ్ క్రెటా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌స్ట‌మ‌ర్ల 9.5 ల‌క్ష‌ల మందికి పైగా యూజ‌ర్లు సొంతం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News