Royal Enfield Bullet 350 | జే సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. మూడో తేదీ నుంచి డెలివరీ ప్రారంభం..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) మూడు వేరియంట్లలో లభ్యం అవుతుంది.
Royal Enfield Bullet 350 | దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మోటారు సైకిళ్లంటే కుర్రాళ్లకు ఎంతో మోజు. హీరో మోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్స్, టీవీఎస్ మోటార్స్ వంటి కంపెనీలు సరికొత్త బైక్‌లు తెచ్చినా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటారు సైకిళ్లపై రైడింగ్ మజాయే డిఫరెంట్. రాయల్ ఎన్‌ఫీల్డ్ సైతం అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లతో నూతన అవతార్‌లో జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న బుల్లెట్ -350 (Royal Enfield Bullet 350)ని ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మున్ముందు దశల వారీగా యూరప్, ఆసియా-పసిఫిక్, అమెరికా మార్కెట్లలో ఆవిష్కరిస్తామని తెలిపింది.ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 3) నుంచి డెలివరీ ప్రారంభిస్తారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) మూడు వేరియంట్లలో లభ్యం అవుతుంది.
మిలిటరీ, స్టాండర్డ్, బ్లాక్ వేరియంట్లలో ఇష్టమైన వేరియంట్ సొంతం చేసుకోవచ్చు. వాటి ధరవరలు ఇలా..
బుల్లెట్ 350 మిలిటరీ : రూ. 1,73,562
బుల్లెట్ 350 స్టాండర్డ్ : రూ. 1,97,432
బుల్లెట్ 350 బ్లాక్ గోల్డ్: రూ. 2,15,801
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటారు సైకిల్ న్యూ జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై 349సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వచ్చింది. పాపులర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌లోనూ జే-సిరీస్ ప్లాట్‌ఫామ్ ఇంజిన్‌నే వాడారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 20.2 బీహెచ్పీ, 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంటుంది. క్లాసిక్ 350 బైక్ లీటర్ పెట్రోల్‌పై 36.2 కి.మీ. మైలేజీ ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ సైతం అదే మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు.
ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్ ఇన్ ఫ్రంట్ , ట్విన్ షాక్స్ ఎట్ రేర్ విత్ 6-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్ కలిగి ఉంటుంది. ఫ్రంట్‌లో 19 అంగుళాలు, రేర్‌లో 18 అంగుళాల స్పోక్ వీల్స్ ఉంటాయి. డ్యుయల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు ఫ్రంట్‌లో 300 ఎంఎం డిస్క్, ఫ్రంట్‌లో 270 ఎంఎం డిస్క్ ఉంటాయి.
మిలిటరీ వేరియంట్ బ్లాక్, రెడ్.. స్టాండర్డ్ వేరియంట్ బ్లాక్, మెరూన్, టాప్ హై ఎండ్ వేరియంట్ గోల్డ్ ఆప్షన్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. న్యూ ఇంజిన్ అండ్ చాసిస్ నంబర్ కలిగి ఉంటుంది. హ్యాండిల్ బార్‌లో ఎల్‌సీడీ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చేర్చారు. దీనివల్ల బైక్ సర్వీస్ అలర్ట్, ఫ్యూయల్ రీడింగ్, ఓడో మీటర్ రీడింగ్, ఎకో ఇండికేటర్ తెలుస్తాయి. ఇంకా న్యూ సీట్, రోటరీ స్విచ్ గేర్, యూఎస్బీ పోర్ట్ కూడా జత చేశారు.
కొత్త తరం 2023 బ్లులెట్-350 మోటారు సైకిల్ చూసేందుకు పాత యూసీఈ వర్షన్‌ను సరిపోలినా కొన్ని గణనీయ అప్ డేట్స్ ఉన్నాయి. జే-సిరీస్ ఇంజిన్‌తో వచ్చిన క్లాసిక్ -350, హంటర్ -350, మీటర్-350 మాదిరిగా బుల్లెట్-350 బైక్ ఉంటుంది. అధునాతన హెడ్ లైట్, టెయిల్ లైట్ ఉంటాయి.