బీఎస్‌ఎన్‌ఎల్‌ వార్షికోత్సవ ఆఫర్‌.. 24 జీబీ ఉచిత డేటా

ఆఫర్‌ పొందాలంటే రూ. 500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీచార్జ్‌ చేసుకోవాలని కండీషన్‌

Advertisement
Update:2024-10-03 14:34 IST

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తున్నది. సంస్థను స్థాపించి 24 ఏండ్లు పూర్తికానున్నది. ఈ నెలలో 25 ఏడాదిలోకి అడుగుపెట్టనున్నది. ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది.

24 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా కస్టమర్లకు ఉచిత డేటా అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 'ఎక్స్‌' ఖాతా ద్వారా వెల్లడించింది. టెలికాం అందిస్తున్న ఆఫర్‌ పొందాలంటే రూ. 500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జి చేసుకున్న వాళ్లందరికీ 24జీబీ ఉచిత డేటా ఇస్తున్నది. ఇప్పటికే ఈ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్‌ 24లోపు రీఛార్జి చేసుకున్న వాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారు.

Tags:    
Advertisement

Similar News