దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. ఉదయం 10గంటల సమయంలో సెన్సెక్స్139.72 పాయింట్లు లాభపడి 80,351.44 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు పెరిగి 24,500.85 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.87 డాలర్ల వద్ద ఉన్నది. బంగారం ఔన్సు 2,759.50 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాన్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు అదే బాటలో నడుస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ నిధులను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. ఎఫ్‌ఐఐలు మంగళవారం నికరంగా రూ. 3,978.61 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 5,869.06 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.