వైఎస్ఆర్ జయంతి.. ఈసారి పోటాపోటీ

వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలతో మళ్లీ పార్టీ చైతన్యవంతమై, ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ఇది తొలి అడుగులా ఉండాలని సజ్జల వైసీపీ శ్రేణులకు సూచించారు. ఇటు కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Advertisement
Update:2024-07-06 09:11 IST

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. జులై 8న రాష్ట్రవ్యాప్తంగా పార్ట తరపున కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. తండ్రి జయంతి రోజున ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు జగన్ పులివెందుల బయలుదేరారు. మూడురోజులపాటు పులివెందులలో ఉండబోతున్న జగన్, వైఎస్ఆర్ జయంతి రోజున ఇడుపులపాయలో నివాళులర్పించి అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. గత ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో వైఎస్ఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈసారి వైసీపీ అధికారంలో లేకపోయినా జయంతి ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. జయంతి రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విగ్రహాలను శుభ్రపరచి పూలతో అలంకరించి సిద్ధం చేయాలని, పార్టీ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు సజ్జల. మళ్లీ పార్టీ చైతన్యవంతమై, ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ఇది తొలి అడుగులా ఉండాలని ఆయన చెప్పారు. వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే మమేకమై ఉన్నారని, పార్టీ కూడా ఎప్పుడూ ప్రజలతోనే నడిచిందని వివరించారు సజ్జల.

కాంగ్రెస్ హడావిడి..

ఈసారి వైఎస్ఆర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ తరపున రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆదేశించారు. పార్టీ తరపున జరిగే కార్యక్రమాల్లో ఆమె కూడా పాల్గొంటారు. ఈ ఏడాది వైసీపీకి పోటీగా కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ జయంతిని నిర్వహించబోతోంది.

కీలక ప్రకటనలు..

రాష్ట్రవ్యాప్త పర్యటనకు జగన్ ఆల్రడీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు మొదలు పెట్టాలా, కొన్నిరోజులు వేచి చూడాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. టీడీపీ దాడుల్లో నష్టపోయారంటున్న వైసీపీ కార్యకర్తల పరామర్శ యాత్రపై వైఎస్ఆర్ జయంతి రోజు కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News